Begin typing your search above and press return to search.

మ‌రో ప్ర‌ముఖ న‌టుడు రేప్ కేసులో అరెస్ట్!

By:  Tupaki Desk   |   22 Sep 2017 8:08 AM GMT
మ‌రో ప్ర‌ముఖ న‌టుడు రేప్ కేసులో అరెస్ట్!
X
ఎప్పుడూ లేని విధంగా ఈ మ‌ధ్య‌న విచిత్ర‌మైన ఉదంతాల్లో ప్ర‌ముఖులు బుక్ అవుతున్నారు. అత్యాచారాలు.. లైంగిక దాడులు లాంటి వాటి విష‌యంలో ప్ర‌ముఖుల ఉదంతాలు బ‌య‌ట‌కు వ‌చ్చేవి కావు. కానీ.. ఇటీవ‌ల కాలంలో అలాంటి దుర్మార్గ‌మైన ఉదంతాలు వ‌రుస‌గా వినిపిస్తున్నాయి.

ఆ మ‌ధ్య‌న కేర‌ళ‌లో ప్ర‌ముఖ న‌టిపై క‌దులుతున్న కారులో లైంగిక దాడుల‌కు పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరాచ‌కానికి కార‌ణం ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడ‌న్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. స‌ద‌రు న‌టి మీద కోపంతో.. ఆమె మీద ప‌గ తీర్చుకోవాల‌న్న ఉద్దేశంతో ఆమెపై లైంగిక దాడి చేయాలంటూ మ‌నుషుల్ని పంప‌ట‌మే కాదు.. వారి చేత ఫోటోలు.. వీడియోలు కూడా తీయించారు.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఉదంతం వెనుక ప్ర‌ముఖ సినీన‌టుడు దిలీప్ కుమార్ ఉన్న‌ట్లుగా గుర్తించిన పోలీసులు అత‌డ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. నాటి నుంచి జైల్లో ఉన్న అత‌గాడు ఇప్పుడు బెయిల్ కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలకు కోర్టు నో మీద నో చెప్పేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా భోజ్ పురికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు మ‌నోజ్ పాండేపై రేప్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తాజాగా ఒక న‌టి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌నోజ్ త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లుగా ఒక న‌టి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును ఆధారంగా తీసుకొని కేసు న‌మోదు చేశారు. ఈ కేసు వెలుగులోకి వ‌చ్చిన నాటి నుంచి స‌ద‌రు నుటుడు పరారీలో ఉన్నాడు.

త‌న‌తోనే కాకుండా మరికొంద‌రు మ‌హిళ‌ల‌తోనూ స‌ద‌రు న‌టుడికి లైంగిక సంబంధాలు ఉన్నాయ‌ని బాధిత న‌టి వాపోతున్నారు. సినిమా ఇండ‌స్ట్రీకి అవ‌కాశాలు వ‌చ్చే అమ్మాయిల‌కు వ‌ల వేసి.. వారికి మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తుంటాడ‌ని అత‌నిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముంబ‌యిలో స‌ద‌రు న‌టుడు మ‌నోజ్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విచారిస్తున్న‌ట్లు స‌మాచారం.