Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ ప్లేస్ లో కేసీఆర్‌!... 14వ స్థానంలో బాబు!

By:  Tupaki Desk   |   23 March 2019 4:21 PM GMT
ఫ‌స్ట్ ప్లేస్ లో కేసీఆర్‌!... 14వ స్థానంలో బాబు!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన వేళ ఆస‌క్తిక అంశాల‌కు కొద‌వేమీ లేదు. ఈ కోవ‌లోనే ఇప్పుడు వెలువ‌డిన సీ ఓట‌ర్ స‌ర్వే వెల్ల‌డించిన వివ‌రాలు ఆయా పార్టీల‌ను ప్ర‌త్యేకించి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఆశ్చ‌ర్య‌క‌ర అంశాల‌తో కొన్ని పార్టీలో జోష్ పెరిగితే.. మ‌రికొన్ని పార్టీకు మాత్రం బిగ్ షాక్ త‌గిలిన‌ట్టుగానూ చెప్ప‌క త‌ప్ప‌దు. సీ ఓట‌ర్ స‌ర్వే అంటే ఆషామాషీ స‌ర్వే ఎంత‌ మాత్రం కాదు. ఎంందుకంటే దేశంలోనే అతి పెద్ద నెట్ వ‌ర్క్ క‌లిగిన సీ ఓట‌ర్ సంస్థ చేప‌ట్టే స‌ర్వేల‌న్నీ దాదాపుగా ప‌క్కాగానే ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌రే... సీ ఓట‌ర్ సర్వే ప‌క్కా స‌ర్వేనే గానీ... అస‌లు ఆ స‌ర్వేలో ఏముంద‌న్న విష‌యాన్ని చెప్ప‌కుండా ఈ గోలేంట‌నేగా మీ డౌటు? అయితే ఆ స‌ర్వే వివ‌రాల్లోకి వెళ్లిపోదాం ప‌దండి.

దేశంలోనే అత్యుత్త‌మంగా రాణించిన ముఖ్య‌మంత్రులు ఎవ‌రు? ఆ సీఎంల ఆధ్వ‌ర్యంలోని పార్టీల ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఎలా ఉంద‌న్న విష‌యంపై ఈ స‌ర్వేలో సీ ఓట‌ర్ అంచ‌నా వేసింది. ఈ స‌ర్వేలో టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు అగ్ర‌స్థానంలో నిల‌బ‌డ‌గా. పొరుగు రాష్ట్రం - నిత్యం కేసీఆర్ తో త‌న‌ను తాను పోల్చి చూసుకుంటున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మాత్రం ఏకంగా 14వ స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. గ‌డ‌చిన ఐదేళ్ల పాల‌న‌లో తెలంగాణ‌లోని ప్ర‌జ‌ల్లో 68 శాతం మందిని సంతృప్త‌ప‌ర‌చిన కేసీఆర్‌కు సీ ఓట‌ర్ అగ్ర‌స్థానం కేటాయించింది. ఇక చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే... 41 శాతం మందికి మాత్ర‌మే సంతృప్తి క‌లిగించార‌ట‌. ఏకంగా 29 శాతం మంది ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పాల‌న అస్స‌లంటే అస్స‌లు బాగోలేద‌ని కూడా తేల్చి చెప్పేశార‌ట‌. ఇక కేసీఆర్ త‌ర్వాతి స్థానాల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ -ఒడిశా సీఎంలు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో నిలిచార‌ట‌. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా విడుద‌లైన ఈ స‌ర్వే... టీఆర్ఎస్‌లో ఫుల్ జోష్ క‌నిపిస్తుండ‌గా, టీడీపీలో మాత్రం తీవ్ర నైరాశ్యాన్ని నింపేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.a