Begin typing your search above and press return to search.

నిన్న ట్యాంకర్ డ్రైవర్.. నేడు మిస్టర్ ఆసియా!

By:  Tupaki Desk   |   24 Oct 2016 11:19 AM GMT
నిన్న ట్యాంకర్ డ్రైవర్.. నేడు మిస్టర్ ఆసియా!
X
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్ని ఇప్పటికే చాలా మంది చాలా సందర్భాల్లో రుజువు చేశారు. ఇదే క్రమంలో ఒక ట్యాంకర్ డ్రైవర్ ఎంతో కష్టపడి బాడీ బిల్డింగ్ చేసి మిస్టర్ ఆసియా టైటిల్ సాదించాడు. ఎన్నో అభినందనలు అర్హుడైన ఈ మిస్టర్... కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన జి.బాలకృష్ణ. ఇతడు వృత్తిరీత్యా ట్యాంకర్‌ డ్రైవర్‌.

ఇటీవల ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఐదో ఫిలి-ఏసియా బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ లో పాల్గొన్న బాలకృష్ణ ఈ మిస్టర్ ఆసియా టైటిల్‌ ను కైవసం చేసుకున్నాడు. స్థానికంగా... "బెంగళూరు ఆర్నాల్డ్‌" గా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆయనకు తల్లి పర్వతమ్మ, సోదరుడు రాజేష్‌ లు ఈ విషయంలో అండగా నిలిచారు. బాలకృష్ణ గతంలో కూడా జర్మనీలో జరిగిన పోటీలో అండర్‌-24 కేటగిరిలో మిస్టర్‌ యూనివర్స్‌ గా - 2014లో ఏథెన్స్‌ లో జరిగిన పోటీల్లో అండర్‌ -24కేటగిరిలో మిస్టర్‌ వరల్డ్‌ గా ఎంపికయ్యాడు.

కాగా, 'మిస్టర్ ఆసియాగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా, మరెంతో గర్వంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు" అంటూ బాలకృష్ణ స్పందించారు. ఈ స్థాయిలో తన బాడీ బిల్డప్ కావడానికి కోచ్ ల శిక్షణతో పాటుగా ప్రతీరోజూ 750 గ్రా. చికెన్ - 25 కోడిగుడ్లు - 300 గ్రా. రైస్ - 200 గ్రా. కాయగూరలు - అప్పుడప్పుడూ చేపలు - మరింత ప్రోటీన్స్ కోసం ప్రూట్ జ్యూస్ బాలకృష్ణ మెనూ ఐటంస్ అంట. బాలకృష్ణ ముంబైకి చెందిన సంగ్రామ్‌ చౌగ్లా - పంజాబ్‌ కు చెందిన మునిష్‌ కుమార్‌ లు వద్ద శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ జిమ్‌ ఇన్‌ స్ట్రక్టర్‌ గా - వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ గానూ విధులు నిర్వహిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/