Begin typing your search above and press return to search.

ఇండియాలో అగ్నిపర్వతం బద్ధలవుతోందా..?

By:  Tupaki Desk   |   19 Feb 2017 7:32 AM GMT
ఇండియాలో అగ్నిపర్వతం బద్ధలవుతోందా..?
X
అగ్నిపర్వతాలంటే ఆఫ్రికా - ఆస్ట్రేలియా - దక్షిణమెరికా ఖండాల్లోనే బాగా పాపులర్. వెస్టిండీస్ దీవుల్లోనూ నిత్యం అగ్నిపర్వతాలు రగులుతుంటాయి. కానీ.. ఇండియాలో మాత్రం ఆ భయం లేదు. ప్రకృతి విపత్తులకు నెలవైన ఇండియాలో అగ్నిపర్వతాల భయం మాత్రం లేదు. అందుకు కారణం.. ఇండియా ఉన్నది ఒకే ఒక పెద్ద అగ్నిపర్వతం. అది కూడా ఎప్పుడూ కూల్ కూల్. కానీ.. తాజాగా ఆ ఏకైక అగ్నిపర్వతం బద్ధలవుతోందన్న మాట ఇండియాను షాక్ కు గురిచేస్తోంది.

ఇండియాలో ఉన్న ఆరు అగ్నిపర్వతాల్లో బారన్ వాల్కనో ఒకటి. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. దాదాపు 150 సంవత్సరాలుగా అది ఏమాత్రం పొగలు కక్కలేదు. 1991 నుంచి మాత్రం అప్పుడప్పుడూ పొగలు కక్కుతోంది. తాజాగా ఇది లావా కూడా రిలీజ్ చేస్తుండడంతో ఏ క్షణమైనా బద్ధలవుతందని అంటున్నారు. ఈ అగ్నిపర్వతంపై ఇటీవలి కాలంలో పలుమార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు లావా బయటకు వస్తుండటాన్ని గుర్తించారు.

దీంతో శాస్త్త్రవేత్తలు ఇప్పటికే దీన్నుంచి శాంపిల్స్ సేకరించి, లావా కంపోజిషన్ ను పరిశీలిస్తున్నారు. ఎన్ ఐఓ టీమ్ ఒకటి దీని పరిస్థితిని గమనిస్తోంది. పగటి పూట దీనిపైన బూడిద మేఘాలు కనిపిస్తున్నాయట.. రాత్రి పూట ఎరుపురంగులో లావా కూడా బయటకు వస్తోందట. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ ఐఆర్), ఎన్ఐఓ ప్రతినిధులు దీన్ని పరిశీలిస్తున్నారు.

అండమాన్ లో పెద్దగా జన సాంద్రత లేకపోవడంతో ఇబ్బందేమీ ఉండదంటున్నారు. కానీ, ముందుజాగ్రత్తగా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అండమాన్ లోని పోర్టు బ్లెయిర్ తీరానికి వచ్చే అన్ని ఓడలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ అగ్నిపర్వతం పరిస్థితి విషమిస్తే పోర్టు బ్లెయిర్ రేవుకు కార్యకలాపాలు ఆపాలని కూడా అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/