Begin typing your search above and press return to search.

ఒబామా మాట‌!... ట్రంప్‌ ది క్రూర‌మైన చ‌ర్యే!

By:  Tupaki Desk   |   6 Sep 2017 10:12 AM GMT
ఒబామా మాట‌!... ట్రంప్‌ ది క్రూర‌మైన చ‌ర్యే!
X
అమెరికా అధ్య‌క్షుడిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప‌లు వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌పై అన్ని వ‌ర్గాల నుంచి కూడా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్న మాట మ‌న‌కు తెలిసిందే. అయితే ఆ దేశానికి అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన బ‌రాక్ ఒబామా... ట్రంప్ నిర్ణ‌యాల‌ను ఇప్ప‌టిదాకా సుతిమెత్త‌గానే త‌ప్పుబ‌ట్టినా... ఘాటైన ప‌ద‌జాలాన్ని వాడింది లేద‌నే చెప్పాలి. ప్ర‌ధానంగా అమెరికా వ‌ల‌స విధానంలో స‌రికొత్త‌గా మార్పులు తీసుకువ‌స్తున్న ట్రంప్‌... త‌న‌కంటే ముందుగా దేశాధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ఒబామాకు దాదాపుగా పూర్తిగా విరుద్ధంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న మాట ఎప్పుడో తేలిపోయింది.

అయినా కూడా ట్రంప్ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతూ ఒబామా పెద్ద‌గా స్పందించిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. అయితే తాజాగా ఎనిమిది లక్షల మంది ‘డ్రీమర్ల’ జీవితాలపై ప్రభావం చూపేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై మాత్రం ఒబామా చూస్తూ ఊరుకోలేక‌పోయార‌నే చెప్పాలి. ఈ నిర్ణ‌యంపై ట్రంప్ సంతకం చేసిన విష‌యం తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే ఒబామా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌నే చెప్పాలి. అస‌లు ట్రంప్ నిర్ణ‌యం క్రూర‌మైన చ‌ర్య‌గా ఉందంటూ ఒబామా ఘాటు వ్యాఖ్య‌లు కూడా చేశారు. ట్రంప్ నిర్ణ‌యాన్ని తూర్పార‌బ‌ట్టిన ఒబామా... ట్రంప్ నిర్ణ‌యాన్ని అనాలోచిత నిర్ణయంగా అభివ‌ర్ణించారు.

డ్రీమర్ల ప్రోగ్రాంకు ముగింపు పలికేలా తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తమ భవిష్యత్తు కలిగిన యువకుల జీవితాల్లో చీకట్లు కమ్మేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని, అదో క్రూరమైన, హింసాత్మక నిర్ణయమని ఒబామా ఫైరైపోయారు. ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేస్తున్నట్టు ప్రకటించి 8 లక్షల మంది యువకుల జీవితాలను ట్రంప్ చీకట్లలోకి నెట్టారు. ట్రంప్ నిర్ణయం ఏడువేల మంది భారతీయులపైనా పడింది. ఫలితంగా ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి వ్యతిరేకంగా అప్పుడే ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఒబామా.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.