Begin typing your search above and press return to search.

దిమ్మతిరిగే సమాధానం చెప్పిన సైకో కిల్లర్!

By:  Tupaki Desk   |   26 July 2016 5:04 AM GMT
దిమ్మతిరిగే సమాధానం చెప్పిన సైకో కిల్లర్!
X
సాదారణంగా పోలీసులకు చిక్కిన వ్యక్తులు.. తాము చేసిన నేరలపై సమర్ధించుకోవడానికో, డొంక తిరుగుడు కారణాలు చెప్పడానికో ప్రయత్నిస్తుంటారు.. మరీ పెద్దవాళ్లైతే మా లాయర్ తో మాట్లాడుకోండి అని చెప్పేస్తారు. కానీ తాజాగా బ్యాంకు దొంగతనానికి ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయిన వ్యక్తి మాత్రం ఇంటరాగేషన్ సమయంలో పోలీసులకు షాక్ ఇచ్చాడు. ఆ మాట విన్న పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు కనిపించడం మరోమలుపు.

ఒకవ్యక్తి బ్యాంక్ దొంగతనానికి యత్నిస్తుండగా బిహార్ లోని వైశాలి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన వ్యక్తి..."నన్ను ఇంటరాగేట్ చేసి మీ విలువైన సమయం వృధా చేసుకోవద్దు.. గూగుల్ లో సైకో కిల్లర్ అమిత్ అని సెర్చ్ చేస్తే నా గురించి మొత్తం తెలుస్తోంది" అని చెప్పాడు. దీంతో కంగుతున్న పోలీసులు తాము వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అతడే అని తెలిసి షాకయ్యారు. వివరాలన్నీ తెలుసుకుంటే వైశాలి - పాట్నాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ సుమారు 22 హత్యలు చేసిన సైకో కిల్లర్ ఇతడే అని తెలుసుకున్నారు.

ఇతగాడి పేరు.. అవినాష్ శ్రీవాస్తవ అలియాస్ అమిత్! ఇతడు ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ లలాన్ శ్రీవాస్తవ కుమారుడు. 2003లో లలాన్ హత్యకు గురైయ్యాడు. దీంతో తన తండ్రి హత్యతో సంబంధం ఉన్న పప్పుఖాన్ అనే వ్యక్తి చంపడంతో తన సీరియల్ స్టార్ చేసిన అవినాష్.. తన తండ్రి హత్యకు కారకులైన మరో నలుగురిపై కూడా దాడి చేశాడట. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవిషయం ఏమిటంటే... ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంసీఏ చదివిన అవినాష్.. పలు అగ్రశేణి ఐటీ సంస్థల్లో కూడా పనిచేశాడు. బాలీవుడ్ సినిమా 'గ్యాంగ్ ఆఫ్‌ వాసేపూర్-2' క్లైమాక్స్ ప్రేరణతో తన తండ్రిని హత్యచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నానని అవినాష్ చెప్పడం కొసమెరుపు.