Begin typing your search above and press return to search.

ఇంటికెళ్లే తొందర బాధితురాలిగా మార్చిందా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 4:40 PM GMT
ఇంటికెళ్లే తొందర బాధితురాలిగా మార్చిందా?
X
చిన్నతప్పు ఆమెను తీరలేనంత వేదనను మిగిల్చింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పాడుకాలంలో బతుకున్న సగటుజీవి ఏ మాత్రం తప్పు చేసినా అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని బెంగళూరులోని తాజా నిర్బయ బాధితురాలి ఉదంతం చెప్పకనే చెబుతోంది. తోటి స్నేహితురాలి మాటను వినని ఆమెకు అంతులేని ఆవేదన మిగిలేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.

ఆపీసు నుంచి బయటకు వచ్చి.. బస్టాప్ లో నిలుచుకున్న బాధితురాలితో పాటు.. ఆమె పక్కన మరో స్నేహితురాలు కూడా ఉందట. అప్పటికే కాస్త సమయం గడవటం.. ఇంటికి వెళ్లాలన్న అతృతలో ఉన్న బాదితురాలు.. ఆటోలు కూడా లేని సమయంలో మినీ బస్సు రావటం.. అందులో ఆమె వెళ్లాల్సిన ప్రాంతానికి తీసుకెళతామని చెప్పటంతో బస్సు ఎక్కిందట. అయితే.. బస్సులోపల చూసి.. ఎవరూ లేరని..వెళ్లటం అంత మంచిది కాదన్నా.. ఫ్రెండ్ మాట పెడచెవిన పెట్టి.. ముక్కుమొహం తెలీని వారి మాటను నమ్మి బస్సు ఎక్కేసిందట.

అనంతరం ఆమెను దఫదఫాలుగా అత్యాచారం చేయటమే కాదు.. నరకం చూపించిన వారు.. బస్సులో పెద్ద సౌండ్ తో కన్నడ పాటలు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు.. ఆమెను కత్తితో బెదిరించినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. గుడి దగ్గర వదిలేసి వెళ్లిన తర్వాత తన సోదరితో పాటు.. స్నేహితురాలికి సమాచారం ఇవ్వటంతో ఆమెను ఆసుపత్రికి చేర్చారట. ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా.. అప్రమత్తంగా ఉన్నా బాధితురాలికి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమో