Begin typing your search above and press return to search.

హీరోలాంటి క్రికెట‌ర్‌ ను జీరో చేసిన యాడ్‌

By:  Tupaki Desk   |   26 Oct 2016 11:12 AM GMT
హీరోలాంటి క్రికెట‌ర్‌ ను జీరో చేసిన యాడ్‌
X
ఒక్క యాడ్ అత‌డి ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. అప్ప‌టివ‌ర‌కూ అత‌డ్ని ఆకాశానికి ఎత్తేసే వారు సైతం తిట్టేయ‌టం మొద‌లెట్టారు. క్రికెట‌ర్‌గా హీరోగా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్నా.. అత‌ను న‌టించిన ఒక యాడ్ అత‌డ్ని ఇరాక‌టంలో పడేయ‌ట‌మే కాదు.. అంద‌రి చేతా తిట్లు తినేలా చేస్తోంది. ఇంత‌కీ ఆ క్రికెట‌ర్ ఎవ‌రంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. బంగ్లాదేశ్ క్రికెట‌ర్ ష‌బ్బీర్ రెహ‌మాన్ ఇటీవ‌ల కాలంలో త‌న అద్భుత ఫాంతో ఇర‌గ‌దీసేస్తున్నాడు. మొన్న‌టికి మొన్న ఇంగ్లండ్‌ తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడు కానీ.. అత‌నికి బంగ్లా జ‌ట్టు నుంచి పెద్ద స‌హ‌కారం ల‌భించ‌క‌పోవ‌టంతో ఏమీ చేయ‌లేక‌పోయారు.

ఒక‌వేళ కానీ.. ఇంకెవ‌రైనా అత‌నికి తోడుగా నిలిస్తే.. ఇంగ్లండ్ మీద చారిత్ర‌క టెస్టు విజ‌యాన్ని న‌మోదు చేసేవాడు కూడా. ఇలా ఆట‌తో మైదానంలో చెల‌రేగిపోతున్న ష‌బ్బీర్ రెహ‌మాన్‌ కు బంగ్లాదేశ్‌లో అభిమానులు ఎక్కువే. అత‌డికున్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌నుకున్న ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ అత‌నితో ఒక‌ యాడ్ కు కాంట్రాక్టు కుద‌ర్చుకుంది.

సంప్ర‌దాయ దేశ‌మైన బంగ్లాదేశ్ లో శ్రుతిమించిన విధంగా యాడ్‌ ను రూపొందించ‌టం ఇప్పుడు వివాదంగా మారింది. అస్కార్ అనే నాన్ అల్కాహాలిక్ డ్రింక్‌ ను ప్ర‌మోట్ చేయ‌టం కోసం.. ఒక లేడీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌తో చెప్పిన డైలాగ్ ఇప్పుడు వివాదంగా మారింది. ఈ డ్రింక్ తాగాలంటూ కాస్తంత ప్రైవ‌సీ కావాల‌ని ష‌బ్బీర్ చెప్ప‌టం.. పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించినా మోడ‌ల్ నైలా రెచ్చిపోతూ హాట్ హాట్ గా క‌నిపించ‌టం.. ష‌బ్బీర్ చేతుల‌కు బేడీలు వేసిన తీరుపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ తీవ్ర‌త ఎంత ఎక్కువైందంటూ.. బంగ్లాదేశ్ క్రికెట్ గౌర‌వాన్ని దెబ్బ తీస్తుంద‌ని చెబుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆ యాడ్‌ను నిషేధించింది. పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే ఆఫ‌ర్ల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యం ఇలాంటి ఘ‌ట‌న‌లు చెప్ప‌క‌నే చెప్పేస్తాయ‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/