Begin typing your search above and press return to search.

సీఎంగా రాజీనామా చేసి ఆ మాట చెప్పు దీదీ

By:  Tupaki Desk   |   21 Sep 2017 4:29 PM GMT
సీఎంగా రాజీనామా చేసి ఆ మాట చెప్పు దీదీ
X
ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి చేయాల్సిన ప‌నేమిటి? రాష్ట్రానికి ప్ర‌శాంతంగా ఉంచ‌టం.. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వ‌టం.. వారికి కించిత్ ఇబ్బంది ఎదురుకాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం. కానీ.. ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీరు మాత్రం ఇందుకు భిన్నం. త‌న‌కు న‌చ్చిన‌ట్లే జ‌ర‌గాల‌నుకునే తీరు ఆమెలో ఎక్కువ‌.

ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే దానికి భిన్నంగా జ‌రిగితే ఆమె తట్టుకోలేరు. తాను ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఉన్నాన‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోన్న‌ట్లుగా ఉంటుంది ఆమె తీరు. వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలోనూ.. వ్యాఖ్య‌లు చేయ‌టంలోనూ ముందుండే దీదీ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కొన్ని రోజుల క్రితం మొహర్రం సంద‌ర్భంగా దుర్గామాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం నిర్వ‌హించ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. దీనిపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో పాటు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. దీదీ తీసుకున్న నిర్ణ‌యంపై న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

దీదీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపూఔ విచార‌ణ జ‌రిపిన కోల్ క‌తా హైకోర్టు ఆమె నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. మొహ‌ర్రం సంద‌ర్భంగా దుర్గామాత విగ్ర‌హాల్ని నిమ‌జ్జ‌నం పై నిషేధాన్ని కోర్టు ఎత్తేసింది. ఈ త‌ర‌హాతో ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం స‌రికాద‌న్న వ్యాఖ్య‌ను హైకోర్టు చేసింది. దుర్గామాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నాన్ని మొహ‌ర్రం రోజున అన్ని రోజులూ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తిస్తూ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది.

పౌరుల హ‌క్కుల్ని ఆలోచ‌నార‌హితంగా నియంత్రించ‌రాద‌ని పేర్కొంది. అధికారం ఉంది క‌దా అని ఏప‌క్షంగా ఆదేశాలు ఇస్తారా? అంటూ సూటిగా అడిగేసింది. హైకోర్టు వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఇదిలాఉంటే.. సీఎం దీదీ తాజాగా రియాక్ట్ అయ్యారు. విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ఏదైనా హింస చెల‌రేగితే త‌న‌ది బాధ్య‌త కాద‌ని దీదీ పేర్కొన‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. దీనిపై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.