Begin typing your search above and press return to search.

కేసీఆర్ పేరు చెప్పగానే భయపడిన బండ్ల గణేష్!?

By:  Tupaki Desk   |   24 Sep 2018 6:21 AM GMT
కేసీఆర్ పేరు చెప్పగానే భయపడిన బండ్ల గణేష్!?
X
బండ్ల గణేష్ నిన్నటి వరకూ సినీ నిర్మాత.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేత. తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏకంగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన అభిమాన - ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరి బండ్ల గణేష్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ప్రతిపక్ష టీఆర్ ఎస్ ను విమర్శించాలి. కేసీఆర్ ను తిట్టాలి. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఎదురుగా ఉన్న జర్నలిస్టు బండ్ల గణేష్ ను అడిగేశాడు.. దానికి బండ్ల గణేష్ సమాధానం విని ఆ జర్నలిస్టే షాక్ అయ్యాడు..

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి నాకెక్కడిది సార్..’ అంటూ తన భయాన్ని వ్యక్తం చేశారు. దీనికి జర్నలిస్టు కాంగ్రెస్ నాయకుడిగా కేసీఆర్ ను విమర్శించరా అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి బండ్ల ‘‘అప్పుడేమో కానీ.. కేసీఆర్ గారి స్థాయి ఏంటి.? అతను లెజండరీ మ్యాన్..ఆయన్నెందుకు విమర్శిస్తాను.. అంటూ తప్పించుకున్నారు. కేసీఆర్ గారు బాగా చేయకపోతేనే కాంగ్రెస్ తరఫున తాము పోరాడుతామంటూ వివరణ ఇచ్చారు.

దీనికి జర్నలిస్టు కూడా బాగానే కౌంటర్ ఇచ్చాడు. లెజండరీ కేసీఆర్ బాగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు తిడతారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీనికి బండ్ల సూటిగా సమాధానమిచ్చారు. కేసీఆర్ పాలన జనానికి అందడం లేదు.. ఉపయోగపడడం లేదు.. జనాలు విరక్తి చెంది ఉన్నారంటూ మాట మార్చేశాడు.

చివర్లో కేసీఆర్ ను తిట్టడానికి బండ్ల భయపడిపోతున్నాడా అంటే గణేష్ వైరాగ్యపు మాటలు మాట్లాడేశాడు. తాను కాంగ్రెస్ లో చేరినప్పుడే చావుకు భయపడలేదని.. అధికార పక్షం కేసులు పెట్టినా.. జైలుకు పంపినా.. చంపేసినా తాను రెడీ అంటూ భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన అనుభూతిని వ్యక్తం చేశాడు.

ఇలా బండ్ల గణేష్ పైకి కేసీఆర్ అంటే భయం ఉన్నా.. అది లేనట్టుగా ప్రవర్తించిన తీరు.. మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత భయమున్న బండ్ల.. కాంగ్రెస్ నేతగా కేసీఆర్ ను ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న అందరి నుంచి వ్యక్తమవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి