Begin typing your search above and press return to search.

ఎవ‌రినీ తిట్ట‌ని పెద్దాయ‌న బాబుని తిట్టాడు

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:02 PM GMT
ఎవ‌రినీ తిట్ట‌ని పెద్దాయ‌న బాబుని తిట్టాడు
X
బండారు ద‌త్తాత్రేయ‌. తెలుగు రాష్ట్రాల‌కు బాగా తెలిసిన పాత పేరు. బీజేపీ తెలుగు వాళ్ల‌కు కాస్త గుర్తుండ‌టానికి కనిపించే కొన్ని మొహాల్లో ఆయ‌న‌ది ఒక‌టి. ఆయ‌న మిగ‌తా నేత‌ల‌కు కాస్త భిన్నం. ఎవ‌రినీ తిట్ట‌డు. సౌమ్యంగా ఉంటారు. అలాంటి వ్య‌క్తి కూడా కేసీఆర్ కంటే దారుణంగా తిట్టాడు చంద్ర‌బాబును. అస‌లు బండారు ద‌త్తాత్రేయతో తిట్టించుకున్నాడంటే... త‌ట‌స్థులు కూడా చంద్ర‌బాబును అనుమానించే ప‌రిస్థితి.

ఆదివారం ప్ర‌చారంలో భాగంగా బండారు ద‌త్తాత్రేయ మీడియాతో మాట్లాడారు . ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబుపై ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని నరేంద్ర మోడీని చూస్తే చాలు... చంద్ర‌బాబుకు 104 జ్వ‌రం వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. అస‌లు చంద్ర‌బాబు చేసిన‌న్ని దివాలాకోరు రాజ‌కీయాలు ఎవ‌రూ చేయ‌ర‌ని ద‌త్తాత్రేయ వ్యాఖ్యానించ‌డంతో మీడియా వ‌ర్గాల్లో విస్మ‌యం వ్య‌క్త‌మైంది. సీబీఐ విషయంలో చంద్రబాబు వ‌ణికిపోతున్నార‌ని, బాబు తీరు ఆంధ్రప్రదేశ్‌ అంతా నా రాజ్యం అన్నట్లు ఉందని విమ‌ర్శించారు. బాబులో నిజాయితీ ఉంటే సీబీఐకి ధైర్యంగా వెల్‌కం చెప్పాల‌న్నారు. బండారు అంత‌టితో ఆప‌లేదు. బాబును చెడుగుడు ఆడుకున్నారు. ఎన్‌టీఆర్‌ సమాధి వద్ద బాబు నివాళులు అర్పించే సీన్ ఒక విచిత్రం. ఆయన నివాళులు అర్పిస్తే ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుంది.

బాబును ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది తిట్టారు కానీ... బండారు ద‌త్తాత్రేయ వంటి సౌమ్యుల చేత ఆయ‌న తిట్లు ఈ స్థాయిలో తిన‌డమంటే... బాబు గ్రాఫ్ ఏం రేంజ్‌లో ప‌డిపోయిందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే అవినీతి - అక్ర‌మాలతో బ‌జారున ప‌డిన చంద్ర‌బాబు ప‌రువు - కాంగ్రెస్ పొత్తుతో మంట‌ల్లో క‌లిసింది. ఇక ఇలాంటి నేత‌ల విమ‌ర్శ‌ల‌తో సామాన్యులు బాబును దూరం పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. వీటిని స‌మ‌ర్థించుకోలేక టీడీపీ శ్రేణులు లోలోప‌లే మ‌ద‌న‌ప‌డుతున్నాయి. ఏమిటి ఇలా జ‌రుగుతోంది అని ఆందోళ‌నకు గురవుతున్నాయి.