దత్తాత్రేయ కుమారుడికి జిల్లెడు చెట్టుతో పెళ్లి

Thu May 24 2018 15:34:29 GMT+0530 (IST)

దత్తాత్రేయ ఇంటిలో విషాద చాయలు అలుముకున్నాయి.. 21 ఏళ్లకే కుమారుడిని కోల్పోయి దత్తాత్రేయ శోకసంద్రంలో మునిగిపోయాడు. తాజాగా వైష్ణవ్ అంత్రక్రియలను వారి కురుమ సంప్రదాయాలకు అనుగుణంగా చేశారు.. కురుమ సంప్రదాయంలో వివాహం కానీ వారికి జిల్లెడు చెట్టుతో పెళ్లి చేస్తారు. ఆ తంతును దత్తాత్రేయ తన కొడుకుకు కూడా జరిపించారు.  అంతకుముందు ఒగ్గు కళాకారులతో మల్లన్న పట్నాలు వేయించి అంతిమయాత్రలో సంప్రదాయ ఇంగ్లీకం పట్టుకొని దత్తాత్రేయ సోదరుడి కుమారుడు శివశంకర్ ముందుకు నడిపించారు. దత్తాత్రేయ ఇంటినుంచి ప్రారంభమైన అంతిమయాత్ర చివరకు సైదాబాద్ లోని శ్మశానవాటికలో ముగిసింది.*వైష్ణవ్ మరణానికి కారణం అదేనట..

వైష్ణవ్ మంచి భోజనప్రియుడట.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయట నుంచి బర్గర్ చీజ్ పిజ్జా లాంటి పదార్థాలను ఎక్కువగా తీసుకువచ్చుకొని తినేవాడట.. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం వల్ల వైష్ణవ్ శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం వచ్చిందంట.. ఈ మధ్యే కసరత్తులు ప్రారంభించి సన్నబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్లే కొవ్వు వల్ల గుండెపోటుకు దారితీసిందని వైద్యులు అంచనా వేస్తున్నారు.

*అందరితో కలిసిపోయే మనస్తత్వం..

వైష్ణవ్ తండ్రి కేంద్రమంత్రి అయినా సరే ఆయనలో ఏమాత్రం గర్వం ఉండేది కాదని  చూసిన వారు చెబుతున్నారు. తండ్రితో పాటు ఎన్నో సార్లు నాయకులను అంతా ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ప్రచారాన్ని కూడా చేపట్టాడట..  కాలనీ వాసులు స్నేహితులు - బంధువులతో ఇట్టే కలిసిపోయి అందరి వాడిలా ఉంటాడని.. ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ షాక్ గురిచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.