Begin typing your search above and press return to search.

లాయర్లు సమ్మె చేస్తే..నల్లకోట్లు ఎగిరిపోతుందట

By:  Tupaki Desk   |   19 March 2017 5:42 AM GMT
లాయర్లు సమ్మె చేస్తే..నల్లకోట్లు ఎగిరిపోతుందట
X
అన్యాయం జరుగుతున్నప్పుడు.. అందుకు వ్యతిరేకంగా గళం విప్పటం మామూలే. మిగిలిన వారితో కొన్ని వర్గాల వారు సమ్మె చేయటం..ఆందోళనలు నిర్వహించటం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. మారిన కాలానికి తగినట్లుగా.. ఈ మధ్యన ఎప్పుడో కానీ సమ్మెలు.. ఆందోళనలు చేయని కొన్ని వర్గాలు అదే పనిగా చేయటంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వ్యవస్థలో అత్యంత కీలకమైన వారు.. సమ్మెలు.. ఆందోళనలు చేయటంపై కొందరు సమర్థిస్తున్నా.. మరికొందరు మాత్రం తప్పు పడుతున్నారు. తాజాగా ఈ అంశంపై ఆసక్తికర నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

మిగిలిన వారి మాదిరి విధులు బహిష్కరించట.. సమ్మె చేయటం.. ఆందోళనలు నిర్వహించటం లాంటివి చేస్తే.. కఠిన చర్యల దిశగా నిర్ణయాన్ని తీసుకోవటం విస్మయం వ్యక్తమవుతోంది. న్యాయవాదులు సమ్మె చేస్తే వారికి లాయర్ గా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండకుండా చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ బార్ కౌన్సిల్ ప్రాతిపాదిస్తోంది.

లా కమీషన్ కు తన ప్రతిపాదన పంపిన బార్ కౌన్సిల్.. కోర్టు విధులకు ఆటంకం కలిగేలా సమ్మె చేసినా.. విధులు బహిష్కరించినా.. లాయర్లపై వేటు పడుతుంది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని లా కమిషన్ కు ప్రతిపాదించింది. సమ్మె చేసే న్యాయవాదులపై చర్యలు తీసుకునేలా అడ్వకేట్ల చట్టానికి మార్పులు చేయాలని భావిస్తున్న సుప్రీంకోర్టు.. ఇందుకు తగిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా బార్ కౌన్సిల్ ను కోరింది.ఈ నేపథ్యంలో.. సమ్మె చేసే న్యాయవాదులను వారు మళ్లీ లాయర్ గా ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదన చేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. వ్యవస్థలో భాగమైన లాయర్లు తమ నిరసనను చట్టద్ధంగా నిర్వహించటానికి వీలుగా కొన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా.. అలాంటి అవకాశమే లేకుండా బార్ కౌన్సిల్ ప్రతిపాదించిన కఠిన ప్రతిపాదనల పట్ల సుప్రీం కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/