Begin typing your search above and press return to search.

పాపం పెరిగితే దుష్ట శిక్ష‌ణే: బాల‌య్య కామెంట్‌

By:  Tupaki Desk   |   5 Sep 2015 5:11 AM GMT
పాపం పెరిగితే దుష్ట శిక్ష‌ణే:  బాల‌య్య కామెంట్‌
X
యువ‌ర‌త్న‌, హిందూపూర్ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణకు పురాణాల‌పై మంచి ప‌ట్టుంది. రామాయ‌ణ‌ - మ‌హాభార‌త‌ - భాగ‌వ‌త క‌థ‌ల‌ను సంద‌ర్భానుసారం గుక్క‌తిప్ప‌కుండా క్ష‌ణం ఆగ‌కుండా చెప్పేస్తారు. బాల‌య్య‌కు ఇవ‌న్ని త‌న తండ్రి ఎన్టీఆర్ నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చాయి. ఆయ‌న సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడే ..చాలా త‌క్కువ వ‌య‌స్సులోనే ప‌లు పౌరాణిక‌ చిత్రాల్లో న‌టించారు. తాజాగా ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌ల‌ను కూడా అదే స్టైల్లో పురాణ‌గాధ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ చెప్పారు.

శ‌నివారం కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన సందేశంలో పాపం పెరిగితే దుష్ట‌శిక్ష‌ణ త‌ప్ప‌ద‌ని భార‌త పురాణ‌గాధ‌లు చెపుతున్నాయ‌న్నారు. పాపం ఎక్కువైతే భ‌గ‌వంతుడు వివిధ రూపాల‌లో దుష్ట‌శిక్ష‌ణ‌..శిష్ట‌ర‌క్ష‌ణ చేస్తుంటార‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌మాజంలో హింస పెరిగిన‌ప్పుడు, పాపాలు ప్ర‌బ‌లిన‌ప్పుడు భ‌గ‌వంతుడు ఇలా చేస్తాడ‌ని పురాణాలు చెప్పాయ‌ని బాల‌య్య తెలిపారు.

ఆధ్యాత్మికత‌కు ప్ర‌సిద్ధిగాంచిన దేశంగా ఉన్న భార‌త‌దేశంలో పండ‌గ‌ల‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంద‌ని బాల‌య్య తెలిపారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో విల‌సిల్లాల‌ని ఆయ‌న కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి హిందూపురం నియోజక‌ర్గ ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం బాల‌య్య విశేషంగా కృషి చేస్తున్నారు. అక్క‌డ కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డంతో పాటు పార్టీ అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో జిల్లాల్లోనే నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును కూడా సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.