Begin typing your search above and press return to search.

బాలయ్య కారుకు డివైడర్ అంటే ముద్దా?

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:33 AM GMT
బాలయ్య కారుకు డివైడర్ అంటే ముద్దా?
X
కారు రోడ్డు మీద వెళ్తేనే ముద్దు.. అలా కాకుండా.. అది గాలిలోనో - నీళ్ల మీదనో వెళితే దాన్ని ప్రయాణం కాదు విన్యాసం అంటారు. అంటే ఎంచక్కా కారు వెళ్లడానికి వేసిన రోడ్డు మీద కాకుండా, మరో చోట వెళితే అది ప్రమాదంగా నైనా మారుతుంది - సాహసంగానైనా తేలుతుంది. ఈ వ్యాఖ్యానం అంతా ఎందుకంటే హీరో మరియు ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణకు చెందిన కారు మాత్రం.. తరచూ ఇలాంటి సాహసాలే చేస్తున్నట్లున్నది. తాజాగా హైదరాబాదులో.. బాలయ్యకారు రోడ్డు వదిలేసి డివైడర్ ఎక్కేసింది. అయితే ప్రమాదం ఏమీ జరగక పోవడంతో .. జనం దీన్ని తేలిగ్గా తీసుకుని నవ్వుకున్నారు.

అయినా నందమూరి బాలక్రిష్ణ కార్లకు రోడ్డుకంటే.. డివైడర్ అంటేనే ముద్దేమో అని జనం జోకులేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఓసారి ఇదే తరహా ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే బాలక్రిష్ణ తన కారులో బెంగుళూరు విమానాశ్రయానికి వెళుతుండగా.. కారు డివైడర్ ఎక్కేసింది. ఆ సమయంలో కారును బాలయ్యే నడుపుతున్నారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

తీరా ఇవాళ మళ్లీ బాలయ్య కారే. హైదరాబాదు బంజారాహిల్స్ లో అదే తరహా ప్రమాదానికి గురైంది. క్యాన్సర్ ఆస్పత్రి వద్ద వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి, దాని పైకి ఎక్కేసింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమయంలో వాహనంలో బాలక్రిష్ణ లేరని సమాచారం.

అనంతపురంలో ప్రమాదం జరిగినప్పుడు బాలయ్యే నడుపుతుండగా, బంజారా హిల్స్ లో డ్రైవర్ నడుపుతుండగా ప్రమాదం జరిగింది. మొత్తానికి నడిపేది ఎవరైనా సరే.. బాలయ్య కారుకు రోడ్డుకంటే డివైడర్ అంటేనే ముద్దు అని జనం నవ్వుకుంటున్నారు.