Begin typing your search above and press return to search.

సొంత ఇమేజ్ కోసం బాలయ్య ట్రయల్స్

By:  Tupaki Desk   |   11 Feb 2016 6:38 AM GMT
సొంత ఇమేజ్ కోసం బాలయ్య ట్రయల్స్
X
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వియ్యంకుడిగా, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు తనయుడు, సినీనటుడిగా మాత్రమే ఇప్పటి వరకే బాలకృష్ణ అందరికి తెలుసు... అయితే తొలిసారిగా ఆయన తనలోని రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. లేపాక్షి ఉత్సవాల నిర్వహణ ద్వారా బాలకృష్ణ పార్టీలో తన పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు.

హిందూపురం లేపాక్షి ఉత్సవాలను నిర్వాహణలో స్థానిక శాసనసభ్యుడు నంద మూరి బాలకృష్ణ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. గతంలో కనీ, విని ఎరు గని రీతిలో ఈసారి లేపాక్షి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను బాలయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 27 - 28వ తేదీల్లో రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లేపాక్షి ఉత్సవాల నిర్వా హణ పేరుతో బాలకృష్ణ తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు.

లేపాక్షి ఉత్సవాల నిర్వాహణతో ఒకవైపు తెలంగాణలో, మరొక వైపు కేంద్ర మంత్రుల వద్ద తన ఇమేజ్‌ ను పెంచుకునే విధంగా బాలయ్య చక్రం తిప్పుతున్నారు. లేపాక్షి ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా, ఇప్పటికే తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి చందులాల్‌ ను కలిసి ఆహ్వానించిన బాలయ్య - నేడు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు - అశోకగజపతిరాజు లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్న బాలకృష్ణ - తెలుగు వారంతా లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొనాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. అందు కే తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి చందులాల్ ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ఆహ్వానించలేదని, కేవలం దేవాదాయ - పర్యాటక శాఖమంత్రులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమా దానంగా బాలకృష్ణ చెప్పారు. హిందూపురం శాసనసభ్యునిగా ఎన్నికైన తరు వాత బాలకృష్ణ సినిమాలను కూడా తగ్గించుకుని ఎక్కువ సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కేటాయిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు రాజకీయ నాయకునిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించకపోవడంతో, లేపాక్షి ఉత్సవాల నిర్వాహణ ద్వారా తన ఇమేజ్ పెంచుకోవాలని బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారు.