Begin typing your search above and press return to search.

ఆనంద్ మ‌హీంద్రాపై..బాల‌య్య ఫ్యాన్స్ ట్వీట్ల దాడి

By:  Tupaki Desk   |   19 Jan 2018 2:20 PM GMT
ఆనంద్ మ‌హీంద్రాపై..బాల‌య్య ఫ్యాన్స్ ట్వీట్ల దాడి
X
నంద‌మూరి బాల‌య్య జైసింహా సినిమాలో ఒంటి చేత్తో బొలెరో కారును ఎత్తిన సీన్‌ పై ఓ నెటిజ‌న్ చేసిన ట్వీట్‌ కు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ ఆనంద్ మహీంద్ర స్పందించిన సంగ‌తి తెలిసిందే. `మా షోరూమ్స్ లో హైడ్రాలిక్ లిఫ్ట్ లు అవసరం లేదు` అంటూ ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్త చేసిన ట్వీట్ పై బాల‌య్య ఫ్యాన్స్‌ అగ్గిపై గుగ్గిలం అవుతున్నారు. కౌంటర్ ఎటాక్ కు దిగారు. ట్విట్టర్ వేదికగానే ఆనంద్ మహీంద్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిలో కొన్ని కామెంట్స్ ఇలా ఉన్నాయి.

- ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మందిని మీ ట్విట్ బాధపెట్టిందని.. వెంటనే సారీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

- ఆనంద్ మహీంద్రా వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆయన కంపెనీ షేర్లు నష్టపోవాల్సి వస్తుంది.

- అన్ని మహీంద్రా వెహికల్స్ ను బ్యాన్ చేసి తెలుగోళ్ల పవర్ చూపిస్తాం.

- మొదట నీ కస్టమర్లకు మంచి సర్వీసులు అందించటంపై శ్రద్ధ పెట్టాలి. బాలయ్య లాంటి గొప్ప నటుడు - వ్యక్తి గురించి మాట్లాడే పద్దతి ఇది కాదు.

-టాలీవుడ్ హీరోపై కామెంట్స్ చేసే ముందు.. ఓసారి బాలీవుడ్ సినిమాలు చూడాలి. అందులో విమానాలనే తమ చేతులతో కిందకి లాగుతుంటారు.

ఇలా బోలెడు మంది ఆనంద్ మహీంద్ర ట్విట్ కు రీ ట్విట్స్ చేస్తున్నారు. సినిమాలో బొలెరో వెహికల్ ఎత్తిన విషయం పక్కకి వెళ్లి.. ఆనంద్ మహీంద్ర అన్న కామెంట్ వివాదం అయ్యింది. ఈ కామెంట్స్ పై ఆనంద్ మహీంద్ర స్పందిస్తారో లేదో చూడాలి మ‌రి!