Begin typing your search above and press return to search.

బాబు కంటే బాల‌య్య ర్యాంకే ఎక్కువ‌

By:  Tupaki Desk   |   4 Aug 2015 12:09 PM GMT
బాబు కంటే బాల‌య్య ర్యాంకే ఎక్కువ‌
X
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల ప‌నితీరుపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆ మ‌ధ్య స‌ర్వే చేయించిన విష‌యం తెలిసిందే. ఈ స‌ర్వేకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు కొద్దికొద్దిగా లీక‌వుతున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఎమ్మెల్యేల ప‌నితీరు మ‌దింపు విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. త‌న బావ‌మ‌రిది.. క‌మ్ వియ్యంకుడైన బాల‌య్య కంటే ర్యాంకింగ్‌లో వెనుక‌బ‌డి ఉండ‌టం.

ఎమ్మెల్యేగా తొలిసారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన బాల‌య్య కంటే.. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్య‌మంత్రిగా ఒక‌సారి.. తాజాగా ప‌ద్నాలుగు నెల‌లుగా మ‌రోసారి సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బాబు ర్యాంకు త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.1989 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా క్ర‌మం త‌ప్ప‌కుండా ఎన్నిక‌వుతున్న బాబుకు ర్యాంకింగ్ లో తొమ్మిదో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో) ల‌భిస్తే.. ఆయ‌న వియ్యంకుడు బాల‌య్య‌కు మాత్రం ఏడో ర్యాంకు ల‌భించింది.

ఇక‌.. ఎమ్మెల్యేలు నేతృత్వం వ‌హిస్తున్న జిల్లాల ర్యాంకుల్లో బాల‌య్య మొద‌టి స్థానంలో ఉండ‌టం తెలిసిందే.
ఏది ఏమైనా ఎమ్మెల్యేగా తొలిసారి బాధ్య‌త‌లు చేప‌ట్టినా.. ప‌నితీరు ఆధారంగా ల‌భించే ర్యాంకింగ్ విష‌యంలో త‌న‌క‌న్నా ఎంతో సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబు కంటే కూడా మెరుగైన ర్యాంకులో ఉండటం ఆస‌క్తిక‌ర‌మే క‌దూ.