Begin typing your search above and press return to search.

జిల్లాలో మాత్రం ఫస్ట్ ర్యాంక్ బాలయ్యదేనంట

By:  Tupaki Desk   |   2 Aug 2015 5:19 AM GMT
జిల్లాలో మాత్రం ఫస్ట్ ర్యాంక్ బాలయ్యదేనంట
X
అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో ఆసక్తికర ప్రయత్నం చేశారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల పని తీరును మదింపు చేసి.. వారికి ర్యాకింగ్ ఇచ్చారు.

ఎమ్మెల్యేలకు జిల్లాల వారీగా.. రాష్ట్రాల వారీగా.. ర్యాంకులు డిసైడ్ చేయటంతో పాటు.. మంత్రులకు సైతం ర్యాంకులు ఇవ్వటం తెలిసిందే చంద్రబాబు బావ మరిది కమ్ వియ్యంకుడైన బాలకృష్ణకు రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంకు రాకున్నా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నారు.

అనంతపురం జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. అందరి కంటే మిన్నగా బాలయ్యబాబు పని తీరు బాగుందంటూ.. ఆయనకు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో కాకున్నా.. జిల్లా స్థాయిలోనైనా ఈ నట సింహం ఫస్ట్ ర్యాంకులో నిలవటం చూసినప్పుడు.. బాబు ఇచ్చిన ర్యాంకుల మీద కాస్తంత విశ్వసనీయత కలిగించేలా ఉన్నాయన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.