ఆ మాజీ సీఎంపై చెప్పు పడింది

Wed Jan 11 2017 22:22:07 GMT+0530 (IST)

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కలకలం చెలరేగింది. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కు చేదు అనుభవం ఎదురైంది. భటిండాలో ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు ఆయనపైకి చెప్పు విసిరాడు. చెప్పు విసిరిన ఆగంతకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున అమృత్ సర్ (సెంట్రల్) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి దర్బారిలాల్ ని ఆప్ తొలగించింది. దర్బారిలాల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల అంశాన్ని పూర్తిగా పరిశీలించాక దర్బాలీలాల్ ను పోటీ నుంచి తొలగించామని ఆప్ పంజాబ్ శాఖ కన్వీనర్ గురుప్రీత్ సింగ్ తెలిపారు. త్వరలో అమృత్‌సర్ సెంట్రల్ స్థానానికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/