Begin typing your search above and press return to search.

గొంతుకోసి..క‌నుగుడ్లు పీకి..సైనికుడి హ‌త్య‌

By:  Tupaki Desk   |   19 Sep 2018 1:51 PM GMT
గొంతుకోసి..క‌నుగుడ్లు పీకి..సైనికుడి హ‌త్య‌
X
స‌రిహ‌ద్దులో మ‌రో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. పాకిస్థాన్ భ‌ద్ర‌తా దళాలు మ‌రోమారు రెచ్చ‌గొట్టే చ‌ర్య‌కు దిగాయి. మంగళవారం బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్‌కు చెందిన సైనికుడి గొంతును కోశాయి. ఈ ఘటనతో మళ్లీ రెండు దేశాల సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావారణం నెలకొంది. భారత్‌కు చెందిన బీఎస్ ఎఫ్ జవాను గొంతు కోసి అతని కనుగుడ్లు తీసేసి జమ్మూ వద్ద అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పడేసింది. త‌ద్వారా పాక్ రేంజ‌ర్లు త‌న దుష్ట‌బుద్ధిని చాటుకున్నారు. ఈ దుశ్చర్య రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌తకు కార‌ణంగా మారింది.

బోర్దర్ వద్ద ఉన్న సర్కాండా గడ్డిని కోసేందుకు వెళ్లిన జవాన్లపై పాక్ రేంజర్లు ఫైర్ చేశారు. ఈ సంద‌ర్భంగానే రాంఘర్ సెక్టార్‌ లోని పాక్ దళాలు.. బీఎస్ ఎఫ్ జవాను గొంతును కోశాయి. ఆయ‌న మృత‌దేహం అనేక గంట‌ల పాటు ల‌భ్యం కాలేదు. జవాను శరీరం కోసం బీఎస్ ఎఫ్ చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అతి కష్టం మీద రిస్క్ ఆపరేషన్ చేసి భారత జవాన్లు నరేంద్ర కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన శరీరంలో బుల్లెట్ గాయాలను భారత ఆర్మీ అధికారులు కనుగొన్నారు. నరేంద్ర కుమార్‌పై జరిగిన దారుణంపై పాక్ అధికారులు స్పందించలేదు. బీఎస్ ఎఫ్ జవాను అనుకోకుండా సరిహద్దును దాటారని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద గడ్డి ఎక్కువగా పెరగడంతో దాన్ని తొలగించేందుకు పాట్రోల్ పార్టీ వెళ్లిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే జవాను నరేంద్ర కుమార్ అదృశ్యమైనట్లు అధికారులు వివ‌రించారు. ఎల్వోసీ వద్ద భద్రతా దళాలు హై అలర్ట్‌ ను విధించారు. పాక్ రేంజర్ల వద్ద ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిగిన ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ డిమాండ్ చేశారు.