Begin typing your search above and press return to search.

య‌డ్యూర‌ప్ప సంచలన నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   17 May 2018 7:56 AM GMT
య‌డ్యూర‌ప్ప సంచలన నిర్ణ‌యం
X
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా మూడోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన య‌డ్యూర‌ప్ప అప్పుడే ఎన్నిక‌ల్లో బీజేపీ ఇచ్చిన హామీల మీద దృష్టి సారించారు. గ‌వ‌ర్న‌ర్ స‌భ‌లో బ‌ల‌నిరూప‌ణ‌కు 15 రోజుల గ‌డువు ఇచ్చిన నేప‌థ్యంలో య‌డ్యూర‌ప్ప ఏం చేస్తారా ? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌వైపు కాంగ్రెస్, మ‌రోవైపు జేడీఎస్ లు త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. అయితే య‌డ్యూర‌ప్ప మాత్రం అవేమీ ప‌ట్టించుకోకుండా రైతు రుణాల మాఫీ మీద దృష్టి సారించారు.

రాష్ట్రంలో ఉన్న 56 వేల కోట్ల రూపాయ‌ల రుణాల‌ను మాఫీ చేస్తున్న‌ట్లు య‌డ్యూర‌ప్ప తొలి ఫైలు మీద సంతకం చేశారు. అధికారంలోకి వ‌స్తే రూ.ల‌క్ష వ‌ర‌కు రుణాలు మాఫీ చేస్తామ‌ని బీజేపీ త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొంది. సిద్ద‌రామ‌య్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణం రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలే అని భావించిన య‌డ్యూర‌ప్ప రుణ‌మాఫీ అంశాన్ని మొద‌టి ఫైలుగా ఎంచుకుని సంత‌కం చేసేశారు.

శాస‌న‌స‌భ‌లో బ‌ల‌నిరూప‌ణ ఉన్న నేప‌థ్యంలో య‌డ్యూర‌ప్ప మిన‌హా మంత్రులుగా ఎవ‌రూ ప్ర‌మాణ స్వీకారం చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో య‌డ్యూర‌ప్ప తీసుకున్న తొలి నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. రుణ‌మాఫీకి సంబంధించి 24 గంట‌ల‌లోపు స్ప‌ష్ట‌మ‌యిన నివేదిక ఇవ్వాల‌ని రెవెన్యూ సెక్రెట‌రీని య‌డ్యూర‌ప్ప ఆదేశించారు. ఇక శాస‌న‌స‌భ‌లో బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ 15 రోజులు గ‌డువు ఇచ్చినా సుప్రీంకోర్టు మ‌ద్ద‌తు ఇస్తున్న వారి వివ‌రాలు సంతకాల‌తో ఇవ్వాల‌ని ఆదేశించిన నేప‌థ్యంలో రొండు రోజుల్లో బ‌లం నిరూపించుకుని మంత్రివ‌ర్గం విస్త‌రించుకోవాల‌ని య‌డ్యూర‌ప్ప భావిస్తున్న‌ట్లు బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మంత్రి వ‌ర్గం ఏర్పాటు త‌రువాత య‌డ్యూర‌ప్ప‌ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని తెలుస్తుంది.