Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ 'యెడ్డీ డైరీ' కలకలం..

By:  Tupaki Desk   |   23 March 2019 9:01 AM GMT
ఎన్నికల వేళ యెడ్డీ డైరీ కలకలం..
X
త్వరలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ నాయకులకు సంబంధించిన చిట్టా ఒక్కొక్కటి బయటపడుతోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప డైరీ ఇప్పుడు కాంగ్రెస్ కు అందివచ్చిన అవకాశంగా దొరికింది. యడ్యూరప్ప తన డైరీలో బీజేపీ కేంద్ర నాయకులకు ముడుపులు పంపినట్లు రాసుకున్నారని, ఆ డైరీని ఇన్‌కంటాక్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ డైరీపై విచారణ ఎందుకు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు..

కారవాన్‌ అనే పత్రికలో యడ్యూరప్ప డైరీలోని కొన్ని పేజీల గురించి ప్రచురించింది. ఆ పేజీలను మిగతా మీడియాకు కూడా పంపింది. డైరీలోని ఈ పేజీలు సీబీఐ - ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నవేనని పేర్కొంది. ఈ డైరీ పేజీల్లో 2009లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రి. ఆయన కేంద్ర కమిటీ సభ్యులకు దాదాపు 1800 కోట్ల రూపాయలు పంపినట్లు తన డైరీలో రాసుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల్లోని నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీకి ఒక్కొరికి రూ.150 కోట్లు, రాజ్‌నాథ్‌సింగ్‌కు రూ.100 కోట్లు పంపించారని, అలాగే అడ్వానీ, జోషికి 50 కోట్ల చొప్పున మొత్తం వెయ్యి కోట్లకు పైగానే ముడుపులు అందించినట్లు డైరీలో ఉన్నట్లు కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. వీటికి సంబంధించిన వివరాలు యడ్యూరప్ప డైరీ పేజీల్లో ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీం ద్వారా కాకుండా లోక్‌పాల్‌లో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలు యడ్యూరప్ప కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. తన డైరీ పేరిట పత్రికల్లో కథనాలు వచ్చిన మాట అవాస్తమేనని, వాటిని ఆదాయపు పన్ను అధికారులు పరిశీలించి అవి నకిలీవేనని ధ్రువీకరించినట్లు యడ్యూరప్ప పేర్కొంటున్నారు. ప్రజాబలంతో గెలవలేని కాంగ్రెస్‌ ఇలా చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తోందని అంటున్నారు.