మాజీ క్రికెటర్ కు టికెటిచ్చిన బీజేపీ

Tue Apr 23 2019 10:55:18 GMT+0530 (IST)

2019 ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ శక్తియుక్తులన్నింటిని ఉపయోగిస్తోంది. దేశంలోని ప్రముఖులందరినీ ఇప్పటికే బీజేపీలో చేరాలని ఆహ్వానించగా.. కొందరు బీజేపీ ఆఫర్ ను అందుకున్నారు.. మరికొందరు కాలదన్నారు.తాజాగా దేశభక్తి ఇతర రాజకీయ అంశాలపై సీరియస్ కామెంట్స్ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు గాలం వేసిన బీజేపీ సాధించింది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని చెప్పిన గంభీర్ తాజాగా మనసు మార్చుకున్నాడు.

తాజాగా బీజేపీలో చేరిన గౌతం గంభీర్ కు టికెట్ కూడా ఖరారు అయ్యింది. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో గంభీర్ కు ఎంపీ సీటు ఖరారైంది. ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి గంభీర్ పోటీచేయబోతున్నారు.

కాగా తాజాగా ప్రకటించిన బీజేపీ జాబితాలో పలువురు ప్రముఖులకు కూడా చోటు దక్కింది. సౌత్ ఢిల్లీ నుంచి రమేష్ బిదౌరి వెస్ట్ ఢిల్లీ నుంచి ప్రవేశ్ వర్మమ నార్త్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ చాందినీ చౌక్ నుంచి హర్షవర్ధన్ కు చోటు కల్పించారు. ఇలా బీజేపీ అనుకున్నట్టే ఒక క్రికెటర్ కు టికెట్ ఇచ్చి మాట నిలబెట్టుకుంది.