Begin typing your search above and press return to search.

ఆదాయంలో బీజేపీ టాప్.. ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   18 Dec 2018 10:55 AM GMT
ఆదాయంలో బీజేపీ టాప్.. ఎంతో తెలుసా?
X
రాజకీయపార్టీలు నడవాలంటే విరాళాలు రావాల్సిందే.. బడా కంపెనీలు - పారిశ్రామికవేత్తలు ఇలా డబ్బులను విరాళాల రూపంలో అందజేసి అధికారంలో ఉన్న పార్టీతో లబ్ధిపొందుతాయి. అందుకే ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా విరాళాలు సంపాదించింది బీజేపీ పార్టీ. ఆ పార్టీ 2017-18 సంవత్సరంలో సంపాదించిన ఆదాయం అక్షరాల 1027.34 కోట్లు. ఈమేరకు రాజకీయ పార్టీల ఆదాయ - వ్యయాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక రూపొందించింది. అదే 2016-17లో బీజేపీ 1034.27 కోట్లుగా పేర్కొంది. అంటే ఈ సంవత్సరం బీజేపీ ఆదాయం రూ.7కోట్ల వరకు తగ్గింది. బీజేపీ ఈ సంవత్సర ఆదాయం రూ.1027.34 కోట్లు కాగా.. అందులో పార్టీ నడిపేందుకు అయిన ఖర్చు 758.47 కోట్లుగా పేర్కొంది.

రాజకీయ పార్టీలు ప్రతి సంవత్సరం తమ ఆదాయ - వ్యయాలపై ఆడిట్ రిపోర్టును ఆక్టోబర్ 30లోపు అందజేయాలి. కానీ బీజేపీ - సీపీఐ - ఎన్సీపీ పార్టీలు గడువు ముగిశాక డిసెంబర్ లో ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించలేదని సమాచారం. కొన్ని పార్టీలు నిర్ణీత గడువులోపు అందిస్తే.. మరికొన్ని పార్టీలు గడువు తీరాక సమర్పించాయి.

2017-18లో బీఎస్పీ ఆదాయం 51.70 కోట్ల రూపాయలు కాగా.. ఖర్చుగా 14.78కోట్లను ఆ పార్టీ లెక్కచూపింది. ఇక ఎన్సీపీ పార్టీ తమకు ఆదాయం 8.15 కోట్లు కంటే కూడా ఖర్చు 8.84 కోట్లుగా చూపించడం గమానార్హం. పార్టీలకు అందే విరాళాల ఖర్చులకు అన్ని పార్టీలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఈ ఆడిట్ రిపోర్టులతోనే ఏడీఆర్ నివేదికలు రూపొందుతాయి.