Begin typing your search above and press return to search.

కిష‌న్‌రెడ్డి అరెస్టయ్యాడు

By:  Tupaki Desk   |   3 Sep 2015 11:54 AM GMT
కిష‌న్‌రెడ్డి అరెస్టయ్యాడు
X
తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఆయ‌న వ‌రంగ‌ల్ జిల్లా కంత‌న‌ప‌ల్లి నుంచి దేవాదుల ప్రాజెక్టు వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ పాద‌యాత్ర‌కు అనుమ‌తి లేద‌న్న కార‌ణంతో పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. కిష‌న్‌ రెడ్డి పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు తెరాస ప్ర‌భుత్వం ముందుగానే ప్ర‌ణాళిక వేసుకుంది. ఈ క్ర‌మంలోనే భారీ సంఖ్య‌లో పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

కిష‌న్‌ రెడ్డి తెలంగాణ‌లో పెండింగ్ ప్రాజెక్టుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని డిమాండ్ చేస్తూ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. ఈ నేప‌థ్యంలోనే కంత‌న‌ప‌ల్లి నుంచి దేవాదుల వ‌ర‌కు పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. కిష‌న్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పోలీసుల‌కు తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జ‌రిగింది. చివ‌ర‌కు పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

నిన్న‌టి వ‌ర‌కు కిష‌న్‌రె డ్డి రాష్ర్ట బీజేపీ అధ్య‌క్షుడి స్థాయిలో ఉండి కూడా ప్ర‌భుత్వం పై చెప్పుకోద‌గ్గ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో కాస్త దూకుడు పెంచారు. ఎప్పుడు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగినా బీజేపీ తెలంగాణ‌లో తెరాస‌కు అసెంబ్లీ వేదిక‌గా ట‌ఫ్ ఫైట్ ఇవ్వ‌లేదు. టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డో లేదా కాంగ్రెస్ నాయ‌కుల్లో కాస్త ఘాటుగా తెరాస‌పై వ్యాఖ్య‌లు చేసినా కిష‌న్ ఎక్క‌వ‌గా మౌనాన్నే ఆశ్ర‌యిస్తూ వ‌స్తున్నారు. తెరాస‌/ కేసీర్‌ ఫై ఆయ‌న చేసే విమ‌ర్శ‌ల్లో ప‌దును కూడా లోపించింది. బీజేపీ నుంచి అసెంబ్లీలో మాట్లాడితే ముషీరాబాద్ ఎమ్మెల్యే ల‌క్ష్మ‌ణ్ లాంటి వాళ్లు మిన‌హా తెరాస‌ పై చెప్పుకోద‌గ్గ విమ‌ర్శ‌లు చేసేవారే లేరు.

ఇటీవ‌ల బీజేపీతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్న నాగం జ‌నార్థ‌న్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్ లాంటి వాళ్లు కూడా కిష‌న్‌ రెడ్డి ప్ర‌భుత్వంతో వ్య‌వ‌హ‌రించే తీరును ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే తెరాస నాయ‌కులు కూడా ఇటీవ‌ల కిష‌న్‌ ను టార్గెట్‌ గా చేసుకుని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ర్టానికి రావాల్సిన నిధులు తేవడంలో కిష‌న్ విఫలమయ్యారని ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ల పార్టీని నిధుల గురించి ఎందుకు ప్రశ్నించడంలేదని తెరాస బీజేపీని టార్గెట్‌ గా చేసుకుని ఎదురు దాడి చేయ‌డంతో కిష‌న్ కాస్త ఆల‌స్యంగా తేరుకున్నారు. దీంతో పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని తీసుకుని ప్ర‌భుత్వంపై పోరాడేందుకు ఆయ‌న పాద‌యాత్ర ఎనౌన్స్ చేశారు. కిష‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకునేంద‌కు ముందే ప్లాన్ చేసిన పోలీసులు వ‌రంగ‌ల్ జిల్లా ఏటూరు నాగారం వ‌ద్ద ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.