బీజేపీ తొలి జాబితా రిలీజ్.. ఏపీలో అభ్యర్థులు ఎవరంటే?

Thu Mar 21 2019 22:03:12 GMT+0530 (IST)

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ఈరోజు (గురువారం) విడుదల చేసింది. తన తొలి జాబితాలో 182 మంది అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ తొలి జాబితాను బీజేపీ సీనియర్ నేత.. కేంద్రమంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు. ప్రధాని మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి మరోసారి పోటీకి దిగుతున్నట్లు జాబితా ద్వారా వెల్లడైంది. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం.. ఆ పార్టీ అగ్రనేత అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీ నగర్ నుంచి పోటీకి దిగనున్నారు. అద్వానీ స్థానం నుంచి అమిత్ షా బరిలోకి దిగటంపై అక్కడి ఓటర్లు ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇదిలాఉంటే.. ఏపీకి సంబంధించి అభ్యర్థుల జాబితాను చూస్తే..  1. విశాఖపట్నం-పురంధేశ్వరి

2. విజయనగరం- సన్యాసిరాజు

3. నర్సాపురం-మాణిక్యాలరావు

4. గుంటూరు -జయప్రకాశ్

5. అనంతపురం - చిరంజీవిరెడ్డి

6. ఏలూరు- చిన్నం రామకోటయ్య

7. హిందూపురం -పార్థసారథి

8. నరసరావుపేట-కన్నా లక్ష్మీనారాయణ

9. నెల్లూరు- సురేశ్ రెడ్డి

10. తిరుపతి- శ్రీహరిరావు

11. నంద్యాల-ఆదినారాయణ

12. కర్నూలు-పీవీ విజయసారథి