Begin typing your search above and press return to search.

రెండేళ్లలో బాబు జైలుకు..! బీజేపీ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   26 Jun 2019 7:01 AM GMT
రెండేళ్లలో బాబు జైలుకు..! బీజేపీ ప్లాన్ ఇదేనా?
X
ఎన్నికలకు ముందు బీజేపీని ఓడించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేసింది. రాబోయే రెండేళ్లలో జైలుకు పంపడానికి కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసిందా అంటే తాజా మాటలను బట్టి అవుననే సమాధానం వస్తోంది. తెరవెనుక మంత్రాంగం నడుపుతున్న బీజేపీ ఓడిన టీడీపీని నిర్వీర్యం చేసే సామధాన బేధ దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.

తాజాగా కృష్ణ జిల్లాలో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోధర్ బహిరంగంగా చేసిన సంచలన ప్రకటన టీడీపీలో గుబులు రేపుతోంది.

ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన సునీల్ ధియోధర్ ను ఇటీవలే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఈయన మోడీకి వారణాసిలో ఎన్నికల మేనేజర్ గా వ్యవహరించాడు. గుజరాత్ లో మోడీతో కలిసి పనిచేశాడు. ఇంత దగ్గరైన నేత ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును రాబోయే రెండు సంవత్సరాల్లో జైలుకు పంపిస్తామని సంచలన ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఆపరేషన్ టీడీపీ చేపట్టిన బీజేపీ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్న బీజేపీ.. తాజాగా అంబికా కృష్ణను కూడా చేర్చుకొని షాకిచ్చింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసింది. రెండేళ్లలోనే టీడీపీని నిర్వీర్యం చేసి చంద్రబాబును జైలుకు పంపేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు ఏపీ బీజేపీ చీఫ్ మాటలను బట్టి అర్థమవుతోంది.. మోడీకి దగ్గరైన వ్యక్తి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపిస్తామని పేర్కొనడం సంచలనంగా మారింది.