Begin typing your search above and press return to search.

బీజేపీ ముందడుగు వేస్తే ముహుర్తం ర‌చ్చ అయింది

By:  Tupaki Desk   |   16 Oct 2018 6:39 PM GMT
బీజేపీ ముందడుగు వేస్తే ముహుర్తం ర‌చ్చ అయింది
X
ఏపీలో పుంజుకోవాల‌ని, ఏమాత్రం అవ‌కాశం దొరికినా...త‌మ స‌త్తా చాటాల‌ని స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న బీజేపీకి ఆదిలోనే అనూహ్య షాక్‌లు ఎదుర‌వుతున్నాయి. పార్టీ కోసం ఓ అడుగు ముందుకు వేయ‌గా...ఆదిలోనే ఆ పార్టీ నేత‌ల నుంచి ప్ర‌తిప‌ఘ‌ట‌న ఎదురైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. రాష్ట్రం నుంచి అన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో కార్యాలయ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. ఇవాళ మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా మంగళగిరిలో శంకుస్థాపన చేయనున్న పార్టీ రాష్ట్ర కార్యాలయానికి గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని వీఆర్‌ గార్డెన్స్‌ ఎదురుగా భారీ బహిరంగ సభ వేదిక నుంచే రిమోట్‌ ద్వారా శిలాఫలకాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించేందుకు ఉద్యుక్తుల‌వ‌గా పార్టీ నేత‌ల్లో అస‌మ్మ‌తి భ‌గ్గుమంది. ముహుర్తం స‌రిగా లేద‌ని పార్టీ నేత‌లు ఫీల‌య్యారు.

గుంటూరు నుంచి రిమోట్ ద్వారా ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్ కార్యాలయానికి శంకుస్థాపన చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, అష్టమి రోజున రాహుకాలంలో భూమి పూజపై పార్టీ నేతల మండిపడుతున్నారు. ముహూర్తంపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ పార్టీ పెద్దలపై స్థానిక నేతలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా పార్టీలో క‌ల‌క‌లం నెల‌కొంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన భూమిపూజ కార్యక్రమంపై తాజాగా మళ్లీ అంసతృప్తి నెలకొన‌డంపై పార్టీ పెద్దలు వెంట‌నే స్పందించారు. నవరాత్రి సమయంలో అన్నీ మంచి రోజులే అని.. ముహూర్తం విషయంలో ఎటువంటి వివాదం లేదని పేర్కొన్నారు. అయితే, పార్టీ కార్యాక్ర‌మాల్లోనే నేత‌ల్లో స‌ఖ్య‌త లేన‌పుడు ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలు ఎలా చేస్తార‌ని ప‌లువురు నేత‌లు వ్యాఖ్యానించారు.