Begin typing your search above and press return to search.

ఆపరేషన్ తెలుగురాష్ట్రాలు.. వర్కవుటయ్యేనా?

By:  Tupaki Desk   |   19 May 2019 5:54 AM GMT
ఆపరేషన్ తెలుగురాష్ట్రాలు.. వర్కవుటయ్యేనా?
X
ఓ వైపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఫ్లేట్ ఫిరాయింపు.. మరోవైపు కాంగ్రెస్ ను గద్దెనెక్కించి మోడీని దించాలని కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు.. ఇలా ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు దేశంలోని రాజకీయ హంగ్ శూన్యతను తమకు అవకాశంగా అందిపుచ్చుకుంటున్నారు. బీజేపీని చెడుగుడు ఆడేస్తున్నారు. అందుకే ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశపడుతున్న బీజేపీ.. మొదట చేయాల్సిన పని ‘ఆపరేషన్ తెలుగు రాష్ట్రాలు’ అని డిసైడ్ అయ్యిందట..

ఇన్నాళ్లు హిందీ బెల్ట్ రాష్ట్రాలే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాయి. 2014లో అయితే యూపీ - ఎంపీ - మహారాష్ట్ర - రాజస్థాన్ సహా బీహార్ - ఢిల్లీ - గుజరాత్ - హర్యానా తదితర రాష్టాల్లో వచ్చిన మెజార్టీతోనే ఢిల్లీ గద్దెనెక్కింది బీజేపీ. కానీ ఈసారి ట్రైన్ రివర్స్ అయ్యింది. హిందీ బెల్ట్ లోని మూడు కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్ - చత్తీస్ ఘడ్ - రాజస్థాన్ లో అధికారం కోల్పోయింది. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమితో అనుకున్నంత సీట్లు రావని అర్థమైంది. అసలు అధికారంలోకి వస్తామో రామోనన్న టెన్షన్ పట్టి పీడిస్తోంది. అందుకే ఒడిషా - బెంగాల్ - ఈశాన్య రాష్ట్రాల మీదే నమ్మకం పెట్టుకుంది.

నిజానికి కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికే లేదు. అక్కడ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు.. కానీ మోడీ ప్రధాని - అమిత్ షా బీజేపీ అధ్యక్షుడయ్యాక ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేదాకా ఎదిగింది. అస్సలు ఉనికిలో లేని రాష్ట్రాల్లో పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ సౌత్.. అందులోనూ ఆపరేషన్ తెలుగు రాష్ట్రాలు మొదలు పెట్టబోతోందట..హిందీ బెల్ట్ లో పట్టుతగ్గడంతో ఇప్పుడు సౌత్ పై బీజేపీ దృష్టి సారించిందట..

తమిళనాడులో అన్నాడీఎంకేను గుప్పిట పట్టి బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోంది. కర్ణాటకలో మొన్ననే అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఇక కేరళలోనూ శబరిమల ఎపిసోడ్ తో బలం పుంజుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ గుండు సున్నాగా ఉంది. అస్సలు బలం లేకుండా.. ఒకటి అరా సీట్లు కూడా గెలిచే పరిస్థితిలో లేదు..

అందుకే ఇప్పుడు మే 23 తర్వాత గెలిచినా ఓడినా ఆపరేషన్ తెలుగు రాష్ట్రాలు మొదలు పెట్టబోతోందట.. ఇందులో భాగంగా మొదట అధ్యక్షుల మార్పునుంచి జిల్లా - మండల స్థాయి వరకూ ప్రక్షాళన చేయనుందట. బలమైన నాయకులకు నాయకత్వం ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లలో బలంగా తయారవ్వాలని డిసైడ్ అయ్యింట.. ఈ మేరకు కొరుకుడు పడని తెలుగు రాష్ట్రాల్లో పుంజుకొని బాబు - కేసీఆర్ లకు ప్రత్యామ్మాయంగా ఎదగాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. ఇది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరి..