Begin typing your search above and press return to search.

సోనియా ప్రేమ‌క‌థ‌ను తీస్తే..ప్ర‌చారం చేస్తా:ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   23 Nov 2017 5:04 PM GMT
సోనియా ప్రేమ‌క‌థ‌ను తీస్తే..ప్ర‌చారం చేస్తా:ఎమ్మెల్యే
X
ప‌ద్మావ‌తి సినిమా వివాదం మ‌రో మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టికే ఆయా రాష్ర్టాల్లో ఈ సినిమాపై భారీ స్థాయిలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలోకి పాత‌బ‌స్తీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ చేరారు. రాష్ట్రంలో రాజ్‌ పుత్‌ లా ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని నిషేదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఇప్పటికే లేఖ రాసిన రాజాసింగ్ తాజాగా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. రాజ్‌ పుత్‌ ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్‌ చేయాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ డిమాండ్‌ చేశారు.

రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది రాజ్‌ పుత్‌ ఉన్నారని, వారికి యావత్‌ హిందూ సమాజం మద్దతుగా నిలుస్తుందన్నారు. సంజయ్‌ లీలా గతంలో కూడా రామ్‌ లీలా - బాజీరావు మస్తాని చిత్రాలను నిర్మించాడని - అందులో కూడా చరిత్రకు విరుద్దంగా సన్నివేశాలను జోడించాడని రాజాసింగ్ ఆరోపించారు. ఈ చిత్రానికి కాంగ్రెస్‌ నేత శశీథరూర్‌ మద్దతుగా నిలుస్తున్నాడని, అతనికి దమ్ముంటే సోనియా గాంధీ లవ్‌ స్టోరీ - ఆమె ప్రేమ‌ చరిత్రను తెరకిక్కించాలని, అప్పుడు తాము ఉచితంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని కోరుతున్న తమకు కరాచీ - దుబాయిల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, సంజయ్‌ లీలా బన్సాలీ వెనుక పాక్‌ దేశం హస్తం ఉన్నట్లు అనుమానం కలుగుతోంద‌ని రాజాసింగ్ అన్నారు.

సంజ‌య్ లీలా బ‌న్సాలీకి దమ్ముంటే ఔరంగజేబ్‌ - టిప్పుసుల్తాన్‌ ల సినిమాను తీయాలని రాజాసింగ్ సవాల్‌ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీనిపై చొరవ చూపి దేశ వ్యాప్తంగా ఆ చిత్రాన్ని నిషేదించాలని, సినిమా రీళ్లను దగ్దం చేయాలని కోరారు. నగరంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లపై దాడులు చేస్తామన్నారు.