Begin typing your search above and press return to search.

బీజేపీ వాళ్ల‌కు టికెట్లు ఇచ్చినా గెల‌వ‌లేరా?

By:  Tupaki Desk   |   27 April 2017 5:30 AM GMT
బీజేపీ వాళ్ల‌కు టికెట్లు ఇచ్చినా గెల‌వ‌లేరా?
X
భారీ మెజార్టీతో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన బీజేపీకి ఒక కొర‌త మాత్రం మిగిలిపోయింది. తాజాగా జ‌రిగిన ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌య దుందుబిని మోగించిన బీజేపీకి.. ఊహించ‌ని షాక్ ఒక‌టి త‌గిలింది. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని.. ఆ పార్టీకి.. ముస్లిం మైనార్టీల‌కు పెద్ద‌గా లంకె కుద‌ర‌దంటూ వాద‌న‌లు జోరుగా వినిపిస్తుంటాయి. మ‌రోవైపు.. త‌న అభ్య‌ర్థుల ఎంపిక‌లో బీజేపీ.. ముస్లిం మైనార్టీల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోద‌న్న విమ‌ర్శ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే యూపీలో ముస్లింల‌కు ఆ పార్టీ కేటాయించిన సీట్లే నిద‌ర్శ‌నంగా చెబుతుంటారు.

యూపీ ఎన్నిక‌ల నేపథ్యంలో పార్టీ మీద వ‌చ్చిన విమ‌ర్శ‌ల్ని కాస్త త‌గ్గించుకునేందుకు ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఐదుగురు ముస్లిం మైనార్టీ అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇచ్చారు. విచిత్రంగా విజ‌య దుందుబి మోగించిన ఢిల్లీ ఎన్నిక‌ల్లో ముస్లింల‌కు ఇచ్చిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోని బీజేపీ అభ్య‌ర్థులు ఓట‌మిపాలు కావ‌టం ఒక విశేషం అయితే.. ఆ ఐదు చోట్లా.. కాంగ్రెస్ విజ‌యం సాధించ‌టం గ‌మ‌నార్హం.

ఢిల్లీలోని మూడు కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 270 (272 అయితే.. అభ్య‌ర్థుల మ‌ర‌ణంతో రెండు చోట్ల ఎన్నిక‌ను వాయిదా వేశారు) స్థానాల్లో 181 స్థానాల్లో క‌మ‌ల‌నాథులు విజ‌యం సాధించ‌గా.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి కేవ‌లం 48 వార్డుల‌కు.. కాంగ్రెస్‌ను 30 స్థానాల్లో విజ‌యం సాధించింది. భారీ ఎత్తున బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించినా.. మైనార్టీ అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇచ్చిన ఐదు చోట్ల బీజేపీ అభ్య‌ర్థులు ఓడిపోవ‌టం ఇప్పుడా పార్టీలో ప్ర‌త్యేక చ‌ర్చ న‌డుస్తోంది.

తాజా ప‌రిణామం నేప‌థ్యంలో.. ముస్లిం మైనార్టీ అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇచ్చినా.. వారు విజ‌యం సాధించ‌లేర‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ఢిల్లీ మున్సిపాలిటీల్లో గ‌డిచిన ప‌దేళ్లుగా బీజేపీనే ప‌వ‌ర్ లో ఉంది. ఇలాంటి సంద‌ర్భాల్లో స‌హజంగా వ‌చ్చే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును మోడీ ఛ‌రిష్మా అధిగ‌మించిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించేందుకు వీలుగా.. కొన్ని చోట్ల కొత్త అభ్య‌ర్థుల్నితెర మీద‌కు తీసుకొచ్చినా వారు విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో మైనార్టీ అభ్య‌ర్థులు మాత్రం ఓట‌మి పాలు కావ‌టం బీజేపీకి అర్థం కాని ఫ‌జిల్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/