Begin typing your search above and press return to search.

కేసీఆర్‌.. సానియా గురించి కామెంట్లు విన్నావా?

By:  Tupaki Desk   |   18 Feb 2019 12:10 PM GMT
కేసీఆర్‌.. సానియా గురించి కామెంట్లు విన్నావా?
X
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పుల్వామా ఉగ్ర‌దాడిపై స్పందిస్తూ, ఆయ‌న కీల‌క వ్యాఖ్యలు చేశారు. సానియామీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తీసేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు విన్న‌వించారు. పాకిస్తాన్ కొడలైన సానియామీర్జాను ఎందుకు కొన‌సాగిస్తున్నారని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో రాజాసింగ్ పోస్ట్ చేశారు.

జమ్ముకశ్మీర్‌ లో పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులు మరోసారి నరమేధానికి తెగబడి సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడి జ‌ర‌ప‌డంతో దాదాపు 42 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై రాజాసింగ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. పాకిస్థాన్‌ తో మన‌కు ఎటువంటి సంబంధాలూ అవసరం లేదని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జాను తొలగించాల్సిందేన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఆయన విజ్ఞప్తి చేశారు. పుల్వామా ఉగ్రదాడిని నిరసనగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలను రద్దు చేసుకోవడం హర్షణీయమన్న ఆయన.. పాకిస్థాన్‌ కోడలు సానియా విషయంలో పునరాలోచించాలన్నారు. సానియా మీర్జాను కాకుండా తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు లేదాసైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్ నియమించాలని కోరారు.

కాగా, ఇదే ఉదంతంలో సైనా ఊహిచంని వివాద‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి దేశం మొత్తం ఆగ్రహం ఉంటే సానియా తన ట్విట్టర్ అకౌంట్ లో సరికొత్త డ్రెస్ వేసుకున్నాను ఎలా ఉంది అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు డ్రెస్ ఎవరు డిజైన్ చేశారు, మేకప్ ఎవరు చేశారు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి దాని లింక్‌ ను ట్వీట్ చేసింది. ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప‌లువురు ఘాటు వ్యాఖ్య‌లుతో సానియా తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ``యావత్ దేశం బాధపడుతుంటే నువ్వు ఫ్యాషన్ ఫొటోలు అప్ లోడ్ చేస్తావా? దాడి పట్ల చిన్న స్పందన కూడా లేకుండా ఫొటోలు పెడతావా? నీ డ్రెస్ చూపించడానికి ఇదా సమయం? నువ్వసలు భారతీయురాలివేనా? ఇలాంటి దాడులకు సానియా స్పందించదు, ఎందుకంటే ఆమె పాకిస్థాన్ మహిళ`` అంటూ నిప్పులు చెరుగుతూ ఘాటు విమర్శలు చేశారు. ``ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలోనే స్థానం లేదు, మృతవీరుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నా`` అంటూ ట్వీట్ చేసింది. ఇక తాజాగా, రాజాసింగ్ కామెంట్ల నేప‌థ్యంలో ``గొంతు చించుకుంటేనే దేశభక్తా? ``అంటూ ట్రోలింగ్‌ చేసే వారిపై క‌స్సుమంది.