Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ఆయుధమిచ్చిన బీజేపీ

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:37 AM GMT
కేసీఆర్ కు ఆయుధమిచ్చిన బీజేపీ
X
ఒకరు చేస్తే తప్పు.. ఇద్దరు చేస్తే అది ఒప్పే.. పైగా దేశాన్ని ఏలుతున్న పార్టీయాయే.. వాళ్లు చేస్తే ఇక చిన్న పార్టీల తప్పులన్నీ అందులో కొట్టుకుపోతాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిన తప్పు కేసీఆర్ పాలిట ఆయుధమైంది. ఆయనను డిఫెండ్ చేసుకునేలా చేసింది. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నోరు మూయించింది. ఇక కాంగ్రెస్ కోర్టుకెళ్లినా కేసీఆర్ ను ఏమీ చేయలేని పరిస్థితిని కల్పించింది. ఇంతకీ బీజేపీ చేసిన తప్పు ఏంటో తెలుసా.? ‘రాజ్యసభలో టీడీపీ ఎంపీల విలీనం’.

ఇప్పుడు బీజేపీ చేసిన ఈ విలీన ప్రక్రియను కేసీఆర్ బూచీగా చూపి తెలంగాణలో నోళ్లు మూయించే ప్రక్రియకు తెరదించబోతున్నారట.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరి వీలనమైనట్టు లేఖ ఇవ్వడం.. స్పీకర్ చేయడం జరిగిపోయింది. అయితే దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్ద లొల్లి చేసింది. కోర్టుకు కూడా వెళ్లింది. ఇక తెలంగాణ బీజేపీ నేతలు కూడా కేసీఆర్ పై ఫైర్ అయ్యారు..

ఇప్పుడు తెలంగాణ బీజేపీ నోరు మెదపని పరిస్థితి ఎదురైంది. కేంద్రంలోని బీజేపీ టీడీపీ రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవడంతో వారు కేసీఆర్ ను ఏమీ అనని పరిస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనలు చేసి కోర్టుకెళ్లినా.. కేంద్రంలోని బీజేపీ విలీనాన్ని కేసీఆర్ సర్కారు చూపించే అవకాశాలున్నాయి. బీజేపీ విలీనానికి తీసుకున్న రాజ్యాంగంలోని లూప్ హోల్స్ లాంటి క్లాస్ లను కేసీఆర్ రాష్ట్ర హైకోర్టులో ప్రస్తావించి ఇక్కడ విలీనానికి అడ్డంకులు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారట..

ఇలా బీజేపీ చూపిన దారిలో రాష్ట్రంలో ఇటు బీజేపీని.. అటు కాంగ్రెస్ ను దెబ్బతీసే వ్యూహానికి కేసీఆర్ రెడీ అయ్యారు. కేసీఆర్ ది తప్పనే వారు ఇక బీజేపీ పెద్దాయన మోడీషాలను కూడా తప్పు అనాలి.. కేసీఆర్ కూడా అదే వ్యూహాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.. సో మోడీషాలను అనే సాహసం ప్రస్తుతానికి ఎవరికీ లేదు. అందుకే బీజేపీ ఫిరాయింపులు ఇప్పుడు కేసీఆర్ కు కొండంత ధైర్యాన్నిచ్చాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.