Begin typing your search above and press return to search.

బీజేపీ మరో దళిత కార్డ్.. స్పీకర్ ఆయనే..

By:  Tupaki Desk   |   12 Jun 2019 5:58 AM GMT
బీజేపీ మరో దళిత కార్డ్.. స్పీకర్ ఆయనే..
X
2014 ఎన్నికల్లో మోడీ గెలవగానే పార్లమెంట్ స్పీకర్ గా దళిత వర్గానికి చెందిన సీనియర్ పార్లమెంట్ ఎంపీ సుమిత్ర మహాజన్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆమె ఏడు సార్లు ఎంపీగా గెలవడం.. పైగా మహిళ కావడంతో ఆ అత్యున్నత పదవిని ఇచ్చారు. ఈ ఐదేళ్లు ఆమె స్పీకర్ గా సేవలందించారు. ఈసారి మాత్రం పోటీచేయలేదు. దీంతో స్పీకర్ గా కొత్త వారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది..

అయితే ఆశ్చర్యకరంగా బీజేపీ మళ్లీ పార్లమెంట్ స్పీకర్ పదవిని అదే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం విశేషం. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ సీనియర్ దళిత వర్గానికి చెందిన ఎంపీ వీరేంద్రకుమార్ ను లోక్ సభ స్పీకర్ గా దాదాపుగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. దళిత నేత అవ్వడం.. సీనియర్ ఎంపీగా ఉండడంతో ఇదే దళిత కార్డును మళ్లీ ప్రయోగించడానికి బీజేపీ రెడీ అయ్యింది.

దళిత సీనియర్ ఎంపీ అయిన వీరేంద్రకుమార్ ఏడోసారి మధ్యప్రదేశ్ లో ఎంపీగా గెలిచారు. ప్రొట్రెం స్పీకర్ గా కూడా ఆయనే వ్యవహరించనున్నారట.. ఇక డిప్యూటీ సీఎం పోస్టు చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతిసారి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. అయితే కాంగ్రెస్ కు ఇవ్వడానికి బీజేపీకి మనసు ఒప్పడం లేదట.. అందుకే 2014లో అన్నాడీఎంకేకు బీజేపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వగా.. ఇప్పుడు ఆ పార్టీకి ఒకే ఒక ఎంపీ గెలిచాడు. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన వైసీపీకి ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. శివసేన, బీజేడీలు కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి.

ఇక మొదట్లోనే కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోని మేనకాగాంధీకి స్పీకర్ పదవిని ఆఫర్ చేసిందట బీజేపీ.కానీ ఆమె దీన్ని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. కేంద్ర మంత్రిగా తీసుకోకపోవడంతో ఆమె అలకవహించినట్టు తెలిసింది. దీంతో చివరగా మధ్యప్రదేశ్ దళితనేతకు అవకాశం దక్కింది.