Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఓటు బ్యాంకుపై బీజేపీ క‌న్ను

By:  Tupaki Desk   |   17 July 2018 1:30 PM GMT
బాలీవుడ్ ఓటు బ్యాంకుపై బీజేపీ క‌న్ను
X
భారతీయ జనతా పార్టీ నాయకులు తన పార్టీని బలోపేతానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకోసం వారు బాలీవుడ్ ప్రముఖులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. 2014 లో 282 సీట్ల అత్యధిక మెజారిటీ తో గెలిచిన భారతీయ జనతా పార్టీ - ఈ నాలుగేళ్లలో నోట్లు రద్దు - జీఎస్టీ వంటి నిర్ణయాలతో సగటు ఓటరుకు దూరమైందనే చెప్పాలి. వచ్చే సార్వత్రిక ఎన్నికలో తమ పార్టీకి విజయావకాశాలు తక్కువగా ఉన్న చోట ప్రముఖులను బరిలోకి దింపనున్నట్టు సమాచారం. ప్రముఖుల ఫ్యాన్‌ ఫాలో‍యింగ్ ను ఓటుగా మార్చుకోవాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది. ఈ ప్రముఖులలో బాలీవుడ్ నటులతో పాటు పారిశ్రామిక వేత్తలు - క్రీడాకారులు - పద్మ అవార్డు గ్రహీతలను కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికలలో గుజరాత్ - జార్ఖండ్ - ఛత్తీస్‌ గడ్ - బీహార్ వంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి విజయపతాకాన్ని ఎగురవేసింది. అయితే దేశంలోదగ్గర దగ్గరగా 120 లోక్‌సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకూ తన జెండాను ఒక్కసారి కూడా పాత లేకపోయింది. దీంతో అటువంటి చోట ప్రముఖులను నిలబెడితే తమకు బలం చేకూరుస్తుందని పార్టీ అభిప్రాయపడుతోంది. గత ఎన్నికలలో బాలీవుడ్ నటులు కిరణ్ ఖేర్ - ప్రకాశ్ రావేల్ - గాయకులు బాబుల్ - సు ప్రియ - మనోజ్ తివారి. ఒలింపిక్ విజేత రాజ్యవర్దన్ సింగ్ వంటి కొందరు ప్రముఖులు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి లోక్‌ సభకు ఎన్నికయ్యారు.

బాలీవుడ్ ప్రముఖులలో అనుపమ్‌ ఖేర్ - అక్షయ కుమార్ - నానా పటేకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అక్షయ కుమార్ ను పంజాబ్ లేక ఢిల్లీ నుంచి లోక్‌ సభకు నిలబెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే అక్షయ కుమార్ కు భారత పౌరసత్వం లేనందున, ఆయనకు లోక్‌ సభకు పోటీ చేసే అవకాశం లేదు. అక్షయ్ కుమార్ ను భారత పౌరసత్వం తీసుకోవలసినదిగా సూచించినట్లు సమాచారం. నానా పటేకర్ ను మహారాష్ట్ర లోక్‌సభ స్దానానికి టికెట్టు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టుసమాచారం. అయితే ఈ విషయమై ఆ ముగ్గురు ప్రముఖులు పెద్దగా స్పందిచలేద‌ని అంటున్నారు.