లైవ్ కి అడ్డం వస్తే.. అక్కడ తాకి బుక్ అయ్యాడు

Fri May 19 2017 11:52:46 GMT+0530 (IST)

కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఆ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగి.. ఒక ప్రముఖ జర్నలిస్టు చిక్కుల్లో పడిపోయాడు. లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్న వేళ.. తెలిసిన మహిళ ఒకరు పలుకరించినప్పుడు.. అతగాడు చేసిన పనిని ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

బీబీసీ జర్నలిస్ట్ బెన్ బ్రౌన్ ఇంగ్లండ్ లో సుపరిచితుడు. అతగాడు లేబర్ పార్టీ మేనిఫేస్టో విడుదల సందర్భంగా నార్మన్ స్మిత్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది కాస్తా లైవ్ లో వస్తోంది. అదే సమయంలో జర్నలిస్టుకు తెలిసిన మహిళ ఒకరు.. విక్టరీ సింబల్ చూపిస్తూ.. అతని దగ్గరకు వచ్చింది.

లైవ్ కి ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో ఆ మహిళను పక్కకు జరిపే ప్రయత్నంలో అతగాడి చేయి వెళ్లి సరిగ్గా ఆ మహిళ ఛాతీ పార్ట్ ను టచ్ చేసింది. ఊహించని రీతిలో అతగాడి తీరుతో అవాక్కు అయిన సదరు మహిళ.. అతడి భుజం మీద ఒక దెబ్బ కొట్టి తన దారిన తాను వెళ్లింది. ఇదంతా ఆన్ లైన్ లో రికార్డు అయ్యింది. ఎంత బిజీగా ఉన్నా.. లైవ్ లో ఇంటర్వ్యూ చేస్తున్నా.. ఒక మహిళ విషయంలో స్పందించే విషయంలో కాస్త ముందు వెనుకా చూసుకోకుండా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు తిట్టిపోస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. అభిమానంతో పలుకరించే వారి విషయంలో హుందాగా వ్యవహరించాలన్న విషయాన్ని ఈ ఉదంతం చెబుతుందని చెప్పక తప్పదు.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/