Begin typing your search above and press return to search.

సృతి ఇన్ని అబద్ధాలు చెప్పింది

By:  Tupaki Desk   |   12 April 2019 4:40 PM GMT
సృతి ఇన్ని అబద్ధాలు చెప్పింది
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథి నుంచి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన విద్యార్హతలపై వివాదాలకు మరోసారి కేంద్రబిందువు అయ్యారు. అసలు ఆమె డిగ్రీ చదివిందా లేదా అన్నది పెద్ద డైలమా అని పలుమార్లు ఈ వివాదం తెరమీదకు వచ్చింది. అయితే, తాజాగా ఆమె స్వయంగా సమర్పించిన 2019 అఫిడవిట్లో కేంద్ర మంత్రి సృతి ఇరానీ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పేసుకుంది. తాను డిగ్రీ పూర్తి చేయలేదని, కేవలం ఇంటర్ మాత్రమే పాసయ్యానని తాజాగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కరస్పాండెన్స్ డిగ్రీ చేరి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కంప్లీట్ చేసినట్లు అందులో పేర్కొంది.

2014లో సమర్పించిన అఫిడవిట్ లో స్మృతి ఇరానీ తాను 1994లో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ లో మాత్రం తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్ స్కూల్ విధానంలో బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ కోర్సులో చేరి మొదటి ఏడాదే ఆపేసినట్లు వెల్లడించింది. స్మృతి ఇరానీ ఎన్నికల కమిషన్ కు గతంలో అబద్ధం చెప్పినట్లు తానే స్వయంగా ఒప్పుకున్నందున ఆమెను ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వారి వాదన ఏంటంటే... ఆమె అర్హతలు గురించి తర్వాత... కానీ ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడం అతిపెద్ద నేరమని వారు అంటున్నారు. అందుకు స్మృతి ఇరానీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వరాదని అంటున్నారు. ఆమెవి రెండు నేరాలు అని... ఒకటి విద్యార్హతలకు సంబంధించి తప్పుడు రికార్డులు సృష్టించడం అయితే మరోటి తప్పుడు అఫిడవిట్ లు అని అన్నారు. నెటిజన్లను కూడా ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్ చదివి ఐఐటీలకు హెడ్ అయ్యావా తల్లీ అంటూ ఆమెను ట్రోల్ చేశారు.