Begin typing your search above and press return to search.

ప్ర‌పంచాన్ని మెప్పించిన భారతీయ శ్రీ‌మంతుడు

By:  Tupaki Desk   |   29 Nov 2015 5:22 AM GMT
ప్ర‌పంచాన్ని మెప్పించిన భారతీయ శ్రీ‌మంతుడు
X
త‌న కోసం కాకుండా స‌మాజం కోసం జీవించ‌డంలోనే తృప్తి ఉంద‌నే విష‌యం ప్ర‌తి సంద‌ర్భంలోనూ నిరూపితం అవుతోంది. తాజాగా ఈ విష‌యంలో రూపొందించిన గ‌ణంకాల్లో భార‌తీయ ప్ర‌ముఖుడు అద్భుతమైన స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ఉదారత కల్గిన 20 మంది జాబితాలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌ జీ నాలుగో స్థానం దక్కించుకున్నారు. ఉదార స్వభావం కల్గిన ప్రముఖులపై వెల్త్ కన్సల్టెన్సీ వెల్త్-ఎక్స్ - బిజినెస్ ఇన్‌ సైడర్ అధ్యయనం నిర్వహించాయి. ప్రపంచంలోనే అత్యంత దాతృత్వం చేసినవారి జాబితాలో మొదటి స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ - రెండో స్థానంలో బర్క్‌ షైర్ హాత్‌ వే సీఈఓ వారెన్ బఫెట్‌ లు ఉన్నారు. దాతలు ప్రధానంగా విద్యా కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించారని, వారి ఫౌండేషన్ ద్వారా విరాళాలు అందిస్తున్నారని నివేదిక తెలిపింది. 20 మంది దాతల్లో 18మంది విద్యకే ప్రాధాన్యత ఇచ్చారని సంస్థ వివరించింది. మూడో ర్యాంకును సొరోస్ ఫండ్ మేనేజ్‌ మెంట్ వ్యవస్థాపకుడు జార్జి సొరోస్ పొందగా, నాలుగో స్థానంలో భారతీయు డైన అజీమ్ ప్రేమ్‌ జీ నిలిచారు.

2015 అక్టోబర్ నాటికి జీవితకాల విరాళాలను చూస్తే ప్రేమ్‌ జీ 8 బిలియన్ డాలర్లు (రూ.53,360 కోట్లు), అలాగే బిల్ గేట్స్ 27 బిలియన్ డాలర్లు (రూ.1,80,090 కోట్లు) విరాళంగా ఇచ్చారని నివేదిక పేర్కొంది. టాప్-20 దాతలు మొత్తంగా 106.8 బిలియన్ డాలర్లు (రూ.71,23, 56 కోట్లు) విరాళమిచ్చారు. అధ్యయనం ప్రకారం, జాబితాలో తొలి పది మందిలో బిల్ గేట్స్ (జీవితకాల విరాళం 27 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (21.5 బిలియన్ డాలర్లు), సొరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాకుడు జార్జ్ సొరోస్ (8 బిలియన్ డాలర్లు), అజిమ్ ప్రేమ్‌జీ (8 బిలియన్ డాలర్లు), డ్యూటీ ఫ్రీ షాపర్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు చార్లెస్ ఫ్రాన్సిస్ (6.3 బిలియన్ డాలర్లు), అల్ రజి బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు సులైమాన్ బిన్ అబ్దుల్ అజిజ్(5.7 బిలి యన్ డాలర్లు), ఇంటెల్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ (5 బిలియన్ డాలర్లు), మెక్సికన్ టెలికామ్ దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలు, కెబి హోమ్ సహ వ్యవస్థాపకుడు ఎలి బ్రాడ్ (3.3 బిలియన్ డాలర్లు), బిఒకె ఫైనాన్షియ ల్ కార్పొరేషన్ చైర్మన్ జార్జ్ కైసర్ (3.3 బిలియన్ డాలర్లు) ఉన్నారు.