థాయ్ రెస్క్యూ ఆపరేషన్ వెనుక షాకింగ్ నిజం!

Thu Jul 12 2018 18:40:23 GMT+0530 (IST)

జూన్ 23న థాయ్ లాండ్ లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది జూనియర్ ఫుట్ బాల్ జట్టు సభ్యులు - కోచ్ లు ఎట్టకేలకు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఆ గుహలో చిక్కుకున్న 13మందిని నిపుణులైన 90 మంది జాతీయ - అంతర్జాతీయ డైవర్ల రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తెచ్చారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో వారి వీడియోను తొలిసారిగా అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్పత్రి లో మాస్కులు ధరించి..చిరునవ్వులు చిందిస్తూ విజయ సంకేతం చూపుతోన్న ఆ చిన్నారుల వీడియో వైరల్ అయింది. అనేక తర్జనభర్జనల మధ్య అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ఆ చిన్నారులను బయటకు తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారిని బయటకు తెచ్చేందుకు అధికారులు....అత్యంత రిస్కీ ఆప్షన్ ను ఎంచుకున్నారని పుకార్లు వస్తున్నాయి. ఆ పిల్లలకు మత్తు మందు ఇచ్చి బయటకు తెచ్చామని నేవీ సీల్ ఒకరు చెప్పినట్లు థాయ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.ఆ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారుల వయసు....11 నుంచి 16 ఏళ్లలోపే. అదీగాక వారంతా సూర్యుడిని చూడకుండా గుహలో దాదాపు 15 రోజులున్నారు. దీంతో వారు పూర్తిగా బలహీనపడ్డారు. దానికి తోడు వారికి ఈత రాకపోవడం....గుహలో నీటిగుండా - ఇరుకైనా మార్గాల గుండా ప్రయాణించాల్సి ఉండడం...వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా తీసుకువస్తే పిల్లలు భయపడతారని - అందుకే మత్తు మందు ఇచ్చి బయటకు తెచ్చామని ఓ నేవీ సీల్ చెప్పినట్లు లోకల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఆ పిల్లల్లో కొందరు నిద్రపోయారని - కొందరు వేళ్లను కదిపారని ఆ అధికారి చెప్పారట. అయితే దారి పొడవునా కొందరు వైద్యులు పిల్లల పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారని చెప్పారట. అయితే గుహలో చిక్కుకున్న పిల్లల్లో ఒకరి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వారు లోపలికి వెళ్లేటప్పుడు పెద్దమొత్తంలో ఆహారం తీసుకెళ్లారట. ఆ ఆహారమే వారి ప్రాణాలను ఎక్కువ కాలం కాపాడిందని స్థానికులు అంటున్నారు. అయితే పిల్లలను తొలిసారి గుర్తించిన డైవర్లలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత అనస్థీషియన్ - రిచర్డ్ హ్యారిస్ గుహ లో నుంచి వచ్చిన చిట్టచివరి వ్యక్తిగా మిగిలారు. అయితే అలా వచ్చిన కొద్దిసేపటికే తన తండ్రి మరణ వార్త తెలియడంతో స్వదేశానికి తిరిగి వెళ్లారు.