Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తో ఓవైసీ భేటీ - అధికారం అక్క‌ర్లేద‌ని క్లారిటీ

By:  Tupaki Desk   |   10 Dec 2018 1:06 PM GMT
కేసీఆర్‌ తో ఓవైసీ భేటీ - అధికారం అక్క‌ర్లేద‌ని క్లారిటీ
X
ప్రగతిభవన్‌ లో టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఎంఐఎం అధ్య‌క్షుడు - ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ మస‌మావేశానికి ముందే - టీఆర్ ఎస్ కు మజ్లిస్ అండగా ఉంటుందని - కేసీఆరే పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఓవైసీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలింగ్ సరళి - ఓట్ల లెక్కింపు అంశాలపై కేసీఆర్ తో ఓవైసీ చర్చించిన‌ట్లు స‌మాచారం. కాగా, ప్రగతి భవన్ కు ఓవైసీ బుల్లెట్ పై వచ్చారు. దాదాపుగా 4 గంట‌ల పాటు సాగిన భేటీ అనంత‌రం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం ముగిసిన అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజార్టీతో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడనుందని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు టీఆర్ ఎస్ కు అవసరం లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. అయినప్పటికీ తాము కేసీఆర్ వెంటనే ఉంటామని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నారని.. ఆయన వెంటనే ఉన్నారని తెలిపారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ సీఎం కానున్నారు. ఎంఐఎం నుంచి 8 మంది కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ బలమేంటో రేపు తేలిపోతుందన్నారు. రేపు మరోసారి సీఎం కేసీఆర్ ను కలుస్తానని ఓవైసీ పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ ఈసారి 8 స్థానాలలో గెలుస్తుందని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిపోనుందని అన్నారు. తమ మద్దతు కేసీఆర్‌ కే ఉంటుందని తెలంగాణ అసెంబ్లీ రద్దయినప్పుడే స్పష్టంగా చెప్పేశామని ఆయన తెలిపారు. తమకు కేసీఆర్ ప్రభుత్వంలో చేరానే ఉత్సాహం ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి డిమాండ్లు లేకుండా కేసీఆర్ వెంటే ఉంటామని ఆయన చెప్పారు.


టీఆర్ ఎస్‌ అధికారంలోకి వస్తే ఎంఐఎం ప్రభుత్వంలో చేరబోతోందా అనే ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో ఎంఐఎం అధినేత - హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫుల్‌ స్టాప్ పెట్టేశారు.. మేం పకీర్లం... మాకు అధికారం అవసరం లేదని స్పష్టం చేశారుఏంటి? బైక్‌ పై వచ్చారనే ప్రశ్న మీడియా ప్రతినిధుల నుంచి ఎదుర‌వ‌గా దానిపై అసదుద్దీన్ స్పందిస్తూ... ఇది మా నగరం.. మా నగరంలో బైక్‌ లపై తిరగకపోతే ఎలా తిరుగుతాం! అంటూ ప్రశ్నించారు. మమ్మళ్లి... ఇక్కడి నుంచి తరిమివేస్తాం! అంటున్నారు కదా... ఇక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయి... అహ్లదమైన వాతావరణంలో మేం ఎలా కలిసి ఉంటాం... భయం లేకుండా ఎలా తిరుగుతామని అందరికీ తెలియజేయడానికే తాను బుల్లెట్‌ పై వచ్చానని తెలిపారు.