Begin typing your search above and press return to search.

ఢిల్లీ ద‌శ మార్చేందుకు సీఎం దీక్ష‌

By:  Tupaki Desk   |   23 Feb 2019 2:47 PM GMT
ఢిల్లీ ద‌శ మార్చేందుకు సీఎం దీక్ష‌
X
దేశ రాజ‌ధాని ఢిల్లీ మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంతో వార్త‌ల్లోకి ఎక్కింది. ఇటు పూర్తి రాష్ట్ర ప్ర‌భుత్వం హ‌క్కులు-బాధ్య‌త‌లు పొంద‌కుండా ఉండ‌టం...అటు కేంద్ర‌పాలిత ప్రాంతం కాకుండా అన్న‌ట్లుగా కాకుండా అన్న‌ట్లుగా ఢిల్లీ ప‌రిస్థితి త‌యారైన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంత హోదా కలిగి ఉంది. దీనివల్ల అసెంబ్లీ - ముఖ్యమంత్రి పేరుకు మాత్రమే అన్నట్టుగా తయారైంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం హవాయే నడుస్తుంది. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు. కేంద్రం ఆటలు ఇంకానా ఇకపై సాగవు అంటూ సవాల్ విసురుతున్నారు.

ఈ స‌వాళ్ల ప‌రంప‌ర‌లో తాజాగా కేజ్రీవాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం మార్చి 1 నుంచి నిరవధిక నిరశన దీక్ష చేపడుతానని శనివారం ప్రకటించారు. రాష్ట్రం సాధించేంతవరకు దీక్ష విరమించబోనని - మృత్యువును ఎదుర్కోవడానికైనా సిద్ధమేనని ఆయన మీడియా సమావేశంలో ఆవేశంగా ప్రకటించారు. దేశమంతటా ప్రజాస్వామ్యం అమలవుతున్నా ఢిల్లీలో మాత్రం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రజలు ఓటువేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.. కానీ ప్రభుత్వానికి అధికారాలుండవు. అందుకోసమే మేం మార్చి 1 నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం దీక్ష చేపడుతానని కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు.