Begin typing your search above and press return to search.

బ్యాంక్ డిపాజిట్ల‌కు బాధ‌ లేద‌ట‌

By:  Tupaki Desk   |   12 Dec 2017 2:32 PM GMT
బ్యాంక్ డిపాజిట్ల‌కు బాధ‌ లేద‌ట‌
X
బ్యాంకుల్లో దాచిన డిపాజిట్లపై కేంద్ర ప్ర‌భుత్వం క‌న్ను ప‌డింద‌న్న వార్త‌ల నేప‌థ్యం..అది వివాదంగా మారుతున్న క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. బ్యాంక్ డిపాజిట్ల‌కు ఎటువంటి ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్ల‌డించారు. నగదు డిపాజిట్లకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌(FRDI) బిల్లుపై జైట్లీ మాట్లాడారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును పూర్తిగా కాపాడుతామన్నారు.

ఎఫ్ఆర్‌డీపై బిల్లులో బెయిల్ ఇన్ క్లాజ్ వివాదస్పదమైంది. ఆర్థిక సంస్థలు ఆ క్లాజ్ ప్రకారం డిపాజిటర్ల సొమ్మును వాడుకునే అవకాశాలున్నాయి. ఈ బిల్లుపై విమర్శలు వస్తున్న క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివ‌ర‌ణ ఇచ్చారు. కస్టమర్ల డిపాజిట్‌కు ఎటువంటి ప్రమాదం ఉండని జైట్లీ స్పష్టం చేశారు. గత ఆగస్టులో FRDI బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను ఈ శీతాకాల సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది.

ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణల దన్నుతో దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటు పథంలో దూసుకెళ్లడానికి రంగం సిద్ధమయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రస్తుతం మౌలిక సౌకర్యాల రంగం, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంపై కేంద్రీకరించిందని ఆయన వెల్లడించారు.ఓ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సరయిన సమయంలో వృవస్థీకృత సంస్కరణలు అమలు చేయడానికి పూనుకుందని, ఫలితంగా రానున్న రోజుల్లో అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను అమలు చేసిందని పేర్కొన్నారు.