Begin typing your search above and press return to search.

ఈ సారీ మోదీ వచ్చినా... పేదరికం అంతం కాదట

By:  Tupaki Desk   |   16 April 2019 4:06 AM GMT
ఈ సారీ మోదీ వచ్చినా... పేదరికం అంతం కాదట
X
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ తనదైన శైలిలో దూసుకువెళుతున్నట్టే కనిపిస్తోంది. ప్రదాని నరేంద్ర మోదీకి ధీటైన అభ్యర్థి విపక్షంలో కనిపించని నేపథ్యంలో మరోమారు మోదీ పీఎం పీఠం ఎక్కడం ఖాయమన్న వాదనకు కట్టుబడి బీజేపీ నేతలు వ్యవహారం నడుపుతున్నారు. అదే సమయంలో దాదాపుగా అన్ని సర్వేలు కూడా... గతంలో వచ్చిన మెజారిటీ రాకున్నా... మరోమారు మోదీనే పీఎం పీఠం ఎక్కడం దాదాపుగా ఖాయమనే చెబుతున్న వైనం కూడా మనకు తెలిసిందే.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశం అన్ని కోణాల్లో పురోగతిలో నడవడం ప్రారంభమైందని చెబుతున్న కలమనాథులు... మరోమారు మోదీ పీఎం అయితే దేశం మరింతగా పురోగతి సాదిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేడు మీడియా ముందుకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... తమ ప్రభుత్వ ఘనతలను గొప్పగా చెబుతూనే... దేశంలో పేదరికం పరిస్థితిపైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మోదీ అధికారంలోకి వచ్చినా దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోదని - దేశంలోని పేదరికం పూర్తిగా అంతం అవ్వాలంటే... 2031 దాకా ఆగాల్సిందేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఈ దిశగా జైట్లీ లెక్కలు ఎలా ఉన్నాయన్న విషయానికి వస్తే... దేశంలో ప్రస్తుతం 130 కోట్ల జనాభా ఉంటే... అందులో 21 శాతం మంది రోజుకు రూ.150 కన్నా తక్కువ వేతనంతోనే జీవనం సాగిస్తున్నారట. ఈ లెక్క వరల్డ్ బ్యాంకుదేనట. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తాము చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన కారణంగా దారిద్ర్యం తొలగిపోవడం ప్రారంభమైందని జైట్లీ చెప్పుకొచ్చారు. ఇదే రీతిలో పురోగతి సాగితే... రానున్న మూడేళ్లలో బిలో పావర్టీ లైన్ కు దిగువన జీవిస్తున్న వారి శాతం 21 నుంచి 15 శాతానికి పడిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే రీతిన పురోగతి సాగితే.. 2031 నాటికి దేశంలో దారిద్ర్య రేఖ కింద బతుకుతున్న వారు ఒక్కరు కూడా ఉండరని ఆయన లెక్కలు విప్పారు.