Begin typing your search above and press return to search.

జైట్లీ మొహం మీదే ఇంగ్లిష్‌ లో మాట్లాడ‌వ‌ద్ద‌న్నాడు

By:  Tupaki Desk   |   25 Sep 2017 12:53 PM GMT
జైట్లీ మొహం మీదే ఇంగ్లిష్‌ లో మాట్లాడ‌వ‌ద్ద‌న్నాడు
X

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌ లో కీల‌క మంత్రి - కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అనూహ్య‌మైన ప‌రిస్థితి ఎదురైంది. ఆయ‌న్ను ఓ వింత ప్ర‌శ్న ఇబ్బంది పెట్టింది. దీంతో మండిపోయిన అరుణ్ జైట్లీ ఏకంగా ఆయ‌నపై మండిప‌డ్డారు. స‌ద‌రు వ్య‌క్తి జ‌ర్న‌లిస్టు కావ‌డం గ‌మ‌నార్హం. జ‌ర్న‌లిస్టుపై ఆగ్ర‌హం అనే కోణంతో పాటుగా... అలా కేంద్ర‌మంత్రి ఆగ్ర‌హించే స్థాయికి వెళ్లిందంటే ఆ ప్ర‌శ్న స్థాయి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.

అస‌లు విష‌య‌మేమిటంటే దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు నిర్వ‌హించిన ఓ సెమినార్‌ లో కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బుల్లెట్ ట్రైన్‌ పై ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో బుల్లెట్ ట్రైన్‌ పై అరుణ్ జైట్లీ సీరియస్‌ గా ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి లేచి ‘బుల్లెట్ ట్రైన్‌ ని హిందీలో ఏమంటారు?’ అని ప్రశ్నించాడు. దీంతో జైట్లీకి మండిపోయింది..కాస్త సీరియ‌స్‌ గా ఉండ‌టం అల‌వాటు చేసుకోండి అంటూ సూచించారు.

అయితే...హిందీలో మాట్లాడే స‌మ‌యంలో ఇంగ్లిష్ ప‌దం ఎందుక‌ని తాను ప్ర‌శ్నించాన‌ని స‌ద‌రు వ్య‌క్తి వ్యాఖ్యానించారు. ఇంటిగ్రల్‌ హ్యుమనిజం- ఇండయన్‌ వే ఆఫ్‌ అటెయినింగ్‌ సస్టెయిన్‌ బుల్‌ డెవలెప్‌ మెంట్‌ సదస్సులో జైట్లీ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాలంటే బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే బుల్లెట్‌ ట్రెయిన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటే అవి వాస్తవరూపం దాల్చిన తర్వాతనే తెలుస్తుందన్నారు.

బుల్లెట్‌ ట్రెయిన్‌ పట్టాలపైకి వచ్చిన తర్వాతనే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది తెలుస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.ఇటీవల కాలంలో బుల్లెట్‌ ట్రెయిన్‌ల గురించి ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నారని.. ఇవి కేవలం సంపన్నులకు మాత్రమే ప్రయోజనకరమని,, సామాన్యుడికి దీంతో ఒరిగేది లేదని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. గత 15 నెలల కాలంతో తాను అనేకసార్లు జపాన్‌ పర్యటనకు వెళ్లానని, తాను ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి టోక్యో నుంచి యోకాహామా బుల్లెట్‌ ట్రెయిన్‌లో వెళ్లాల్సి వచ్చిందని, జపాన్‌ లో తనకు భోజనం సమస్య తలెత్తిందని.. దీంతో మరో నగరంలో ఉన్న తన మిత్రుడు కేవలం 17 నిమిషాల వ్యవధిలో తనకు ఫలహారం తెచ్చి ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు. తన మిత్రుడు వేరే నగరంలో ఉన్నా స్వల్పవ్యవధిలోనే తనకు ఆహారం సమకూర్చగలిగాడని, బుల్లెట్‌ ట్రెయిన్‌ పవర్‌ అంటే అది అని ఆయన ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

బుల్లెట్‌ ట్రెయిన్‌ తో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ది సాధిస్తుందని - కొత్తగా టౌన్‌ షిప్‌ లకు - స్మార్ట్‌ సిటిలకు బాగా ఉపయోక్తంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 కిలోమీటర్లు ముంబై నుంచి అహ్మదాబాద్‌ కు పనిపై వచ్చి పోవడానికి కేవలం 30 నిమిషాల్లో చేరుకోగలడన్నారు. అయితే వాస్తవంగా బుల్లెట్‌ ట్రెయిన్‌ పట్టాలెక్కిన తర్వాత దీని ప్రయోజనాలు గురించి పూర్తిగా అవగాహన కలుగుతుందన్నారు. ఈ నెల ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేతో కలిసి దేశంలోని మొట్ట మొదటి హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.