Begin typing your search above and press return to search.

జస్టిన్ బీబ‌ర్ లుక్కులో స‌చిన్ త‌న‌యుడు!

By:  Tupaki Desk   |   27 Sep 2016 3:33 PM GMT
జస్టిన్ బీబ‌ర్ లుక్కులో స‌చిన్ త‌న‌యుడు!
X
నిజ‌మేనండోయ్... క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ కొడుకు అర్జున్ టెండూల్క‌ర్ అచ్చుగుద్దిన‌ట్లు కెన‌డియ‌న్ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ లానే క‌నిపిస్తున్నాడు. శ‌నివారం నాడు త‌న 17వ బ‌ర్త్ డే జ‌రుపుకున్న సంద‌ర్భంగా త‌న తండ్రితో క‌లిసి తీసుకున్న ఓ ఫొటోను అర్జున్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స‌ద‌రు ఫొటోలో స‌చిన్ ను అర్జున్ ఓ ఫ్రెండ్ లా స‌ర‌దాగా మెడ ప‌ట్టుకుని ఉన్నాడు. ఈ ఫోజ్ లో అతడు త‌న తండ్రి కంటే కూడా పొడుగ్గా క‌నిపిస్తున్నాడు. అంతేకాకుండా జ‌స్టిన్ బీబ‌ర్ లాగే అత‌డు క‌నిపిస్తున్నాడు. దీంతో ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది.

ముఖ క‌వ‌ళిక‌ల్లో అర్జున్ టెండూల్క‌ర్ అచ్చం బీబ‌ర్ నే పోలి ఉన్నాడు. పాప్ మ్యూజిక్ లో పెను సంచ‌ల‌నంగా మారిన బీబ‌ర్ కు విశ్వ‌వ్యాప్తంగా ఓ రేంజిలో ఫ్యాన్స్ ఉన్నారు. అదే స‌మ‌యంలో క్రికెట్ లో ఏ ఒక్క‌రికి సాధ్యం కాని రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్న స‌చిన్ కు కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇక 17 ఏళ్ల వ‌యసు వ‌చ్చిన అర్జున్ టెండూల్క‌ర్ కూడా త‌న తండ్రిలాగే క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. త్వ‌ర‌లోనే అత‌డు భార‌త జ‌ట్టులో స్థానం సంపాదించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర‌లేదు. ఇక సోష‌ల్ మీడియాలో అర్జున్ పోస్ట్ చేసిన త‌న బ‌ర్త్ డే ఫొటోను చూసిన నెటిజ‌న్లు ప‌లు రకాల కామెంట్లు చేశారు. అర్జున్‌, బీబ‌ర్ లు చిన్న‌నాడు త‌ప్పిపోయిన క‌వ‌ల‌ల‌ని, ఎప్ప‌టికైనా వారు క‌ల‌వ‌డం ఖాయ‌మ‌ని సినిమా స్టైలో కామెంట్లు చేశారు. ఇక చాక్లెట్ ప్రియుల‌ను ఇట్టే ఆక‌ట్టుకున్న‌ఫైవ్ స్టార్ యాడ్ ను కొంద‌రు నెటిజ‌న్లు స్మ‌రించుకున్నారు. స‌ద‌రు యాడ్ లో లాగే అర్జున్‌, బీబ‌ర్ ల‌ను నెటిజ‌న్లు... సురేశ్, ర‌మేశ్ లుగా అభివ‌ర్ణించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/