Begin typing your search above and press return to search.

మైన‌ర్ల‌కు వాహ‌నాలు ఇచ్చిన పేరెంట్స్ కు మూడేళ్లు జైలు!

By:  Tupaki Desk   |   25 Jun 2019 4:51 AM GMT
మైన‌ర్ల‌కు వాహ‌నాలు ఇచ్చిన పేరెంట్స్ కు మూడేళ్లు జైలు!
X
పిల్ల‌ల‌కు వాహ‌నం ఇచ్చే అల‌వాటు చాలామందిలో క‌నిపిస్తుంది. రూల్స్ లో పేర్కొన్న‌ట్లు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ముద్దుగా వాహ‌నాలు ఇచ్చే త‌ల్లిదండ్రుల‌కు.. సంర‌క్ష‌కుల‌కు షాకిచ్చేలా కేంద్రం కొత్త నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇటీవ‌ల కాలంలో పెరిగిపోతున్న ప్ర‌మాదాల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఉన్న మోటారు వాహ‌నాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును తాజాగా కేంద్ర‌మంత్రివ‌ర్గం ఆమోదించింది.

తాజా సవ‌ర‌ణ బిల్లు ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేస్తున్న జ‌రిమానాలు డ‌బుల్ కావ‌ట‌మే కాదు.. మ‌రింత క‌ఠినంగా మార్చారు. పిల్ల‌ల చేతికి తాళాలు ఇచ్చి.. వారు వాహ‌నం న‌డిపేందుకు కార‌ణ‌మైన త‌ల్లిదండ్రుల‌కు.. సంర‌క్ష‌కుల‌కు మూడేళ్ల జైలు.. భారీ జ‌రిమానాతో పాటు.. స‌ద‌రు వ్య‌క్తి డ్రైవింగ్ లైసెన్స్ ను ర‌ద్దు చేయ‌నున్నారు.

ర‌వాణ శాఖ ఇచ్చిన ఆదేశాల్ని ఉల్లంఘించిన‌ట్లు తేలిన వారికి భారీ జ‌రిమానా త‌ప్ప‌దు. ఈ రూల్స్ అందరికీ అని చెబుతూనే మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. నేరాలు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన పోలీసులు కానీ ఇవే రూల్స్ ను బ్రేక్ చేస్తే వారికి రెట్టింపు జ‌రిమానా.. శిక్ష ఉంటుంద‌ని చెబుతున్నారు. మంత్రివ‌ర్గం ఆమోదించిన ఈ బిల్లును తాజాగా జ‌రుగుతున్న స‌మావేశాల్లోనే బిల్లు రూపంలో లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం పెరిగిపోయిన రోడ్డు ప్ర‌మాదాల నేప‌థ్యంలో ఈ త‌ర‌హా క‌ఠిన నిబంధ‌న‌లు ఉండాల‌న్న అభిప్రాయం పెరుగుతోంది. దీంతో.. ఈ బిల్లు చ‌ట్ట‌రూపంలో రావ‌టానికి అట్టే కాలం ప‌ట్ట‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించిన కొత్త జ‌రిమానాలు ఎంత భారీగా అంటే..

నేరం జ‌రిమానా

+ లైసెన్స్ లేకుండా వాహ‌నం న‌డిపితే రూ.5వేలు

+ మితిమీరిన వేగంతో వాహ‌నం న‌డిపితే రూ.2వేలు

+ ప్ర‌మాద‌క‌రంగా వాహ‌నం న‌డిపితే రూ.5వేలు

+ డ్రంక్ అండ్ డ్రైవ్ రూ.10వేలు

+ హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి+ 3 నెల‌లు డ్రైవింగ్ స‌స్పెన్ష‌న్

+ టూవీల‌ర్ వెనుక ఉన్నోళ్లు హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి

+ బీమా చేయించ‌కుంటే రూ.2వేలు

+ అంబులెన్స్ ల‌కు దారి ఇవ్వ‌కుంటే రూ.10వేలు

+ వాహ‌నం న‌డిపే అర్హ‌త లేకున్నా డ్రైవ్ చేస్తే రూ.10వేలు

+ పిల్ల‌ల‌కు వాహ‌నం ఇచ్చిన పెద్ద‌ల‌కు రూ.25వేలు+ 3ఏళ్లు జైలు+ లైసెన్స్ ర‌ద్దు

+ నిబంధ‌న‌ల్ని బ్రేక్ చేస్తే రూ.2వేలు

+ సీటు బెల్ట్ పెట్టుకోకుంటే రూ.వెయ్యి

+ ఓవ‌ర్ లోడింగ్ చేస్తే రూ.20వేలు

+ ఓలా..ఉబ‌ర్ లాంటోళ్లు రూల్స్ బ్రేక్ చేస్తే రూ.ల‌క్ష‌

+ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ పాటించ‌కుంటే రూ.రెట్టింపు జ‌రిమానా