అద్భుతమైన ఫీచర్స్ తో ఐఫోన్ X - 8 - 8+

Wed Sep 13 2017 10:15:55 GMT+0530 (IST)

యాపిల్ ప్రియులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ X వచ్చేసింది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ ను ప్రవేశపెట్టి పదేళ్లు పూర్తయిన సంద్భరంగా ఐఫోన్ X ను విడుదల చేసింది. దీంతోపాటు ఐఫోన్8 - ఐఫోన్8 ప్లస్ పేరిట మరో రెండు మోడళ్లను కూడా మార్కెట్లోకి తెచ్చింది. అద్భుత ఫీచర్స్ తో ఆకట్టుకుంటోన్న ఐఫోన్ Xను యాపిల్ అధినేత టిమ్ కుక్ విడుదల చేయటం విశేషం.ఐఫోన్ 8 - 8+ ప్రత్యేకతలు

ఐఫోన్ 8.. 64 జీబీ - 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే ఉంటుంది. ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇంకా అల్యూమినియం డిజైన్ - యాపిల్ ఏ11 బయోనిక్ చిప్ సెట్ - 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా - క్వాడ్ ఎల్ ఈడీ ట్రు టోన్ ఫ్లాష్ - టచ్ ఐడీ - ఎల్టీఈ అడ్వాన్సుడ్ - బ్లూటూత్ 5.0 స్టీరియో స్పీకర్స్ - వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోపాటు వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
 
ఐఫోన్ 8+ ప్రత్యేకతలు

ఐఫోన్ 8 కంటే ఐఫోన్ 8+ ఇంకా మెరుగైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది కూడా 64 జీబీ - 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో స్క్రీన్ సైజ్ 5.5 అంగుళాలు ఉంటుంది. రేర్ ఫేసింగ్ కెమెరాలు 12 ఎంపీ సామర్థ్యంతో రెండు ఉంటాయి. ఇక మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా ఐఫోన్ 8లానే ఉంటాయి. ఐఫోన్ 8 - ఐఫోన్ 8+ రెండూ సిల్వర్ - స్పేస్ గ్రే - గోల్డ్ కలర్స్ లో లభిస్తాయి.
 
ఐఫోన్ X ప్రత్యేకతలు ఇవే..

-యాపిల్ ఐఫోన్ 10 స్క్రీన్ పరిమాణం 5.8 అంగుళాలు.

-మొట్టమొదటి ఒఎల్ ఈడీ ఫోన్

-సూపర్ రెటీనాతో స్ర్కీన్

- యాపిల్ ఏ11 బయోనిక్ చిప్ సెట్

-ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ

-12 ఎంపీ డ్యుయెల్ కెమెరాలు

-ఓఎల్ ఈడీ టెక్నాలజీతోపాటు స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ - గ్లాస్ బ్యాక్ - త్రీడీ టచ్ - ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ.

-64 - 256 జీబీ మెమొరీల్లో లభ్యం.

- వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోపాటు వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

- స్పేస్ గ్రే అండ్ సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది.

-ధర 64 జీబీ రూ.84 వేలు - 256 జీబీ రూ.102000
 
కాగా మనదేశంలో ఐఫోన్ 8.. 64 జీబీ వేరియంట్ ధర రూ.64 వేలుగా ఉండనుంది. 256 జీబీ వేరియంట్ ధర రూ.77 వేలు. ఐఫోన్ 8+ ధర 64 జీబీ వేరియంట్ ధర రూ.73 వేలుగా - 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86 వేలుగా ఉంటుంది. సెప్టెంబర్ 29 నుంచి మన మార్కెట్లో లభిస్తాయి. మందస్తు బుకింగ్స్ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 22 నుంచి వినియోగదారులకు డెలివరీ చేస్తారు. ముందుగా అమెరికా - చైనా - ఇంగ్లండ్ - ఆస్ర్టేలియాలతో కలిపి మొత్తం 25 దేశాల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. ఇక అద్భుతమైన ఫీచర్స్ తో ప్రవేశపెట్టిన ఐఫోన్ 10కు ముందస్తు బుకింగ్స్ ను వచ్చే అక్టోబర్ నుంచి స్వీకరిస్తారు.