Begin typing your search above and press return to search.

ఈసారి ఐఫోన్ 7ప్లస్ పేలిపోయింది

By:  Tupaki Desk   |   30 Sep 2016 9:18 AM GMT
ఈసారి ఐఫోన్ 7ప్లస్ పేలిపోయింది
X
ప్రతిష్ఠాత్మక కంపెనీలు విడుదల చేసే ఉత్పత్తులకు సంబందించి నాణ్యత.. భద్రతా ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటాయి.అందుకు భిన్నంగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మొన్నటికి మొన్న ప్రఖ్యాత శాంసంగ్ కంపెనీ విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పెద్ద ఎత్తున పేలిపోవటం తెలిసిందే. ఈ వ్యవహారం శాంసంగ్ కంపెనీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. చివరకు ఆ ఫోన్ ను రీకాల్ చేయటమే కాదు.. ఆ ఫోన్ ను పలు విమానాశ్రయాల్లో అనుమతించమని తేల్చి చెప్పేశారు.

గెలాక్సీ నోట్ 7 పేలిపోతున్న వేళ.. యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 7 గిరాకీ పెరిగింది. శాంసంగ్ ఫోన్లను కొనాలనుకున్న వారికి ఐఫోన్ ప్రత్యామ్నాయంగా మారటం.. శాంసంగ్ ను బాధిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా యాపిల్ ఐఫోన్ 7 పేలిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఐఫోన్ 7 ప్లస్ పేలిపోయిందన్న వార్త మార్కెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ప్రపంచాన్ని ఏలే రెండు అతి పెద్ద దిగ్గజాల ప్రతిష్ఠాత్మక బ్రాండ్లు పేలిపోతున్న ఆరోపణలు రావటం.. ఈ రెండింటి పేర్లు ‘‘7’’ ఉండటం గమనార్హం.

తన నోట్ 7 పేలిపోతున్న విషయాన్ని శాంసంగ్ ఇప్పటికే ఒప్పుకోగా.. ఐఫోన్ 7 పేలుతున్న వైనాన్ని యాపిల్ సంస్థ ఇప్పటివరకూ కన్ఫర్మ్ చేయలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఐఫోన్ 7 పేలిపోయిన వైనంలోకి వెళితే.. ఒక వినియోగదారుడు ఐఫోన్ 7 ప్లస్ ను ఆర్డర్ చేయగా.. అది అతని చేతికి వచ్చింది. ప్యాక్ విప్పి చూసినంతనే.. ఆ ఫోన్ పేలిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఫ్యాక్టరీ నుంచి డెలివరీ మధ్యలో ఫోన్ పేలిపోయి ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా ‘‘7’’ అంకె ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలకు ఏ మాత్రం కలిసి వచ్చినట్లుగా లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/