Begin typing your search above and press return to search.

అమ్మను ఎలా తెచ్చారో చెప్పిన అపోలో డాక్టర్

By:  Tupaki Desk   |   26 Feb 2017 4:31 AM GMT
అమ్మను ఎలా తెచ్చారో చెప్పిన అపోలో డాక్టర్
X
మరో కలకలం. అంతకు మించిన సంచలనం. ఇప్పటికే ఉన్న సందేహాలకు మరింత బలాన్ని చేకూర్చే మాటను అపోలో డాక్టర్ నోటి నుంచి వచ్చింది. అమ్మ మృతిపై ఇప్పటికే ఉన్న సవాలక్ష సందేహాలు మరింత పెరిగేలా.. అనుమానాలకు బలం చేకూరే మాట అపోలో డాక్టర్ సీత నోటి నుంచి రావటం ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతోంది. పోయెస్ గార్డెన్ నుంచి అపోలోకు అమ్మను ఏ స్థితిలో తీసుకొచ్చారో ఆమె చెబుతూ.. ‘‘జయను పోయెస్ గార్డెన్ నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఆమెకు చికిత్స జరుగుతున్న ప్రాంతానికి ఇతర డాక్టర్లను అనుమతించలేదు. ఇవన్నీ చూసినప్పుడు ఆమె మృతిపై బలమైన అనుమానం కలుగుతోంది’’ అని వ్యాఖ్యానించారు.

జయ మృతి మీద విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఆమె మాటలు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపాయి. ఇదిలా ఉంటే.. ఆమె కొద్ది రోజుల క్రితం అమ్మ మేనకోడలు దీపను కలుసుకొని ఆమెకు మద్దతు తెలిపారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలవటం గమనార్హం. డాక్టర్ సీత చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారి.. భారీగా వైరల్ అయ్యాయి.

గతంలోనూ.. తాజాగా అమ్మ నేతృత్వం వహించే ఆర్కే నగర్ లో జరిగిన బహిరంగ సభలో అమ్మ మృతిపై మరిన్ని అనుమానాలు కలిగేలా మాట్లాడిన ఆమె మాటల నేపథ్యంలో అపోలో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో.. సైబర్ క్రైం పోలీసులు డాక్టర్ సీతను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరు పర్చగా.. ఆమెకు పదిహేను రోజుల రిమాండ్ ను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమ్మ మృతిలో ఏదో ఉందంటూ ఇప్పటికే బలమైన సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. అపోలో డాక్టర్ సీత మాటలు సందేహాలకు బలాన్ని చేకూర్చటంతో పాటు.. అపోలో యాజమాన్యాన్ని ఇరుకునపడేసేలా చేశాయని చెప్పాలి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో.. ఇప్పటివరకూ అమ్మ మృతిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్న భావాన్ని వ్యక్తం చేసిన వారు సైతం.. ఇప్పుడు ఏమో.. ఏదైనా జరిగి ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేసేలా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/